Shocking Budget For Allu Arjun Pushpa Movie Action Scenes - Sakshi
Sakshi News home page

పుష్ప: తగ్గేదే లే అంటున్న నిర్మాతలు.. ఆ సీన్‌ కోసం 40కోట్లు!

Apr 18 2021 1:25 PM | Updated on Apr 18 2021 5:04 PM

Mythri Spending Huge Amount For Allu Arjun Action Episode In Pushpa Movie - Sakshi

అల్లు అర్జున్‌కు మంచి మార్కెట్‌ ఉండడం, పాన్‌ ఇండియా స్థాయి సినిమా కావడంతో ఖర్చు విషయంలో నిర్మాతలు అస్సలు రాజీపడటం లేదు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’.రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మంగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్‌ పాత్రకు సంబంధించిన వీడియో అభిమానుల తెగ ఆకట్టుకుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.40 కోట్ల  ఖర్చు చేస్తున్నారట. అల్లు అర్జున్‌కు మంచి మార్కెట్‌ ఉండడం, పాన్‌ ఇండియా స్థాయి సినిమా కావడంతో ఖర్చు విషయంలో నిర్మాతలు అస్సలు రాజీపడటం లేదట. ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

బడ్జెట్‌లో ఎక్కువ భాగం యాక్షన్‌ సీక్వెన్స్‌కే కేటాయించారని టాక్‌. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ యాక్షన్స్‌ సీక్వెన్స్‌ ఉంటాయట. ఈ చిత్రంలో విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement