సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా | Music Shop Murthy Movie Ott Streaming Now Details Inside | Sakshi
Sakshi News home page

Music Shop Murthy OTT: 50 ఏళ్ల వ్యక్తికి హీరోగా చేసిన మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి

Jul 18 2024 9:14 AM | Updated on Jul 18 2024 9:44 AM

Music Shop Murthy Movie Ott Streaming Now Details Inside

ఓటీటీలోకి మరో తెలుగు సినిమా వచ్చేసింది. చాలా మూవీస్‌తో పోలిస్తే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ, కామెడీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పేరున్న యాక్టర్స్ చేసినప్పటికీ ఎందుకో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి అందరూ ఎంచక్కా చూసేయొచ్చు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

'రంగస్థలం', 'పుష్ప' తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఘోష్ లీడ్ రోల్ చేసిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. ఇతడితో పాటు చాందినీ చౌదరి మరో కీలక పాత్ర చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. చూడని వాళ్లుంటే ఓ లుక్కేసేయండి.

క్యాసెట్ షాప్ నడుపుకొనే 50 ఏళ్ల మూర్తి అనే వ్యక్తి.. డీజే కావాలనుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఈయనకు డీజేగా పనిచేసే అమ్మాయి పరిచయమవుతుంది. ఈమె దగ్గర మూర్తి డీజే నేర్చుకోవడం, మరి చివరకు ఏమైంది అనేదే 'మ్యూజిక్ షాప్ మూర్తి'.

(ఇదీ చదవండి: బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వెబ్ సిరీస్‪‌‌... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Advertisement
 
Advertisement
Advertisement