ఏఆర్‌ రెహమాన్‌కు అరుదైన గౌరవం | Sakshi
Sakshi News home page

‘బాఫ్టా’ అంబాసిడర్‌గా ఏఆర్‌ రెహమాన్‌

Published Mon, Nov 30 2020 11:21 AM

Music Director AR Rahman Selected Bafta Breakthrough India Ambassador - Sakshi

ఆస్కార్‌ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ని అస్కార్‌ అవార్డుతో సమామైన అవార్డులను ప్రదానం చేసే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్‌‌ట్స(బాఫ్టా) సంస్థ ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌గా నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. బాఫ్టా.. నెట్‌ఫ్లిక్స్‌ సహకారంతో భారత్‌లో ఉన్న గొప్ప కాళాకారులను గుర్తించడానికి ఏర్‌ఆర్‌ రెహమాన్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఐదు రంగాల్లో ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన వారిని బాఫ్టా గుర్తించనుంది. తన ఎంపికపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందింస్తూ.. ‘ నాకు చాలా సంతోషంగా ఉంది. బాఫ్టాతో పని చేస్తూ సినిమాలు, ఆటలు, టీవీ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచే వారిని గుర్తించడం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అని తెలిపారు. చదవండి: ఆది పురుష్‌కి రెహమాన్‌?

ప్రతిభ ఉన్న ఆర్టిస్టులను బాఫ్టా గుర్తించటం ఓ ప్రత్యేకమైన అవకాశం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను గుర్తించి, సంబంధాలు పెంచడంతో పాటు బాఫ్టా అవార్డు విజేతలు, నామినేషన్‌ దక్కించుకున్న వాళ్లకు మెంటర్‌గా ఉంటానని పేర్కొన్నారు. ఇక భారత్‌లో అద్భుతమైన టాలెంట్‌ కలిగి ఉన్న ఆర్టిస్టులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురు చూసున్నానని తెలిపారు. యూకేలో బాఫ్టా బ్రేక్‌ త్రూ ఆర్టిస్టులను 2013 నుంచి గుర్తిస్తోంది. అదేవిధంగా 2019 నుంచి చైనాలో ఉన్న కొత్త ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తోంది. ఇక భారత్‌లో ఉన్న కొత్త టాలెంట్‌ను గుర్తించడానికి బాఫ్టా అడుగులు వేస్తోంది. చదవండి: ఇప్పుడు చెప్పాల్సిన కథ ఇది

ఏఆర్‌ రెహమాన్‌ బాఫ్టా అంబాసిడర్‌గా తమకు మద్దతుగా నిలిచినందుకు ఆనందంగా ఉందని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ అన్నారు. అదే విధంగా కొత్త ప్రతిభను గుర్తించడం, పెంపొందించడంలో తమ అభిరుచులకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. హిందీ, తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలతో అనుబంధం ఉన్న రెహమాన్‌ సేవలు బాఫ్టాకు ఎంతగానో ఉయయోగపడతాయని పేర్కొన్నారు. బ్రేక్‌ త్రూ ఇండియా ఆర్టిస్టులను ఎంపిక చేయడం కోసం జ్యూరీ, న్యాయ నిర్ణేతలను నియామించాల్సి ఉందని బా​ఫ్టా పేర్కొంది.

Advertisement
Advertisement