ఆది పురుష్‌కి రెహమాన్‌? | AR Rahman To Compose Music For Prabhas Adipurush | Sakshi
Sakshi News home page

ఆది పురుష్‌కి రెహమాన్‌?

Sep 14 2020 6:54 AM | Updated on Sep 14 2020 6:54 AM

AR Rahman To Compose Music For Prabhas Adipurush - Sakshi

‘బాహుబలి 1, 2’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ నటించిన ‘సాహో’తో పాటు ప్రస్తుతం నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ ప్యాన్‌ ఇండియా చిత్రాలే. అంతేకాదు.. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో పాటు బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించనున్న ‘ఆది పురుష్‌’ చిత్రం కూడా ప్యాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి. కాగా ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమా¯Œ  సంగీతం అందించనున్నారట.  రామాయణం కథాంశంతో 3డీలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణాసురుడిగా కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement