ముంబయిలో పుష్ప క్రేజ్.. బన్నీ అభిమాని క్రేజీ ఐడియా | Mumbai Vendor Sells Juices Named On Pushpa Star Allu Arjun | Sakshi
Sakshi News home page

Allu Arjun Pushpa: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా.. ముంబయిలో అభిమాని క్రేజీ ఐడియా

Oct 29 2022 5:48 PM | Updated on Oct 29 2022 5:52 PM

 Mumbai Vendor Sells Juices Named On Pushpa Star Allu Arjun - Sakshi

ఐకాన్ స్టార్ బన్నీ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. సినిమా విడుదల నుంచి భాషతో సంబంధం లేకుండా అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే ఆ సినిమాలోని డైలాగ్ చెప్పకుండా ఉండని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఈ చిత్రంలోని తగ్గేదేలే అనే డైలాగ్ టాలీవుడ్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఓ ఊపు ఊపేసింది. తాజాగా బన్నీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. పుష్ప పేరు మీద జ్యూస్‌ల విక్రయం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

ముంబయికి చెందిన బంటీ అనే వ్యాపారి అల్లు అర్జున్ పేరు మీద  డైలాగ్‌లు, చిత్రాలతో కూడిన గ్లాసుల్లో జ్యూస్ విక్రయిస్తున్నాడు. బన్నీ పేరు మీద అనే రకాల శీతల పానీయాలను కస్టమర్లకు అందిస్తున్నారు.  బంటి మాట్లాడుతూ...' అల్లు అర్జున్ సర్‌కి అతని మొదటి సినిమా నుంచి అభిమానిని. ఆయన డైలాగ్స్ అన్నీ ఇష్టపడతాను. పుష్ప సినిమాలో నాకు ఇష్టమైన డైలాగ్ తగ్గేదేలే. హిందీలో 'ఫైర్ హై మెయిన్, జుఖేగా నహీ' అంటూ ఆ డైలాగ్‌ను చెప్పాడు.

 టాలీవుడ్‌లో 2021లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ జగదీష్ ప్రతాప్ బండారి, సునీల్, రావు రమేష్, ధనంజయ, అనసూయ భరద్వాజ్, అజయ్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన కలప ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ ఆధారంగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement