బాలీవుడ్‌ న్యూసెన్స్‌కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి అనుమతి ఉండదు | Mumbai Peddar Road Not living Bollywood Celebrity Why | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ న్యూసెన్స్‌కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా అక్కడ నివాసం కష్టమే

Jul 18 2025 2:05 PM | Updated on Jul 18 2025 3:09 PM

Mumbai Peddar Road Not living Bollywood Celebrity Why

ఆ ముంబై ఏరియాలో అంతే మరి..

వేలకోట్లున్నా క్లబ్‌ మెంబర్‌గా నో ఛాన్స్‌

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు కూడా నో ఎంట్రీ

డబ్బుoటే కొండ మీద కోతి దిగొస్తుంది అంటారు అదేమో గానీ ఒక్కోసారి మనకు కావాల్సిన చోట, కోరుకున్నవారి మధ్య నివాసం కూడా పొందలేమని నిరూపితమవుతోంది. భారతదేశపు వాణిజ్య రాజధాని నగరమైన ముంబైలో సంపద ఉండడం అనేది వారి స్థాయిని నిర్దేశించే ఒక ప్రధాన అంశం, అయితే ఆ నగరంలోని కొన్ని ప్రాంతాలలో విస్తుపోయేలా దీనికి అతీతమైన ధోరణి కనిపిస్తుంది. అటువంటి ఒక ప్రాంతం, పెడ్డర్‌ రోడ్, ఈ రోడ్‌ సంపదకు మాత్రమే కాకుండా దానికే స్వంతమైన ఆలోచనల ద్వారా కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఇక్కడ నివాసాలకు అపారమైన సంపద లేదా ప్రముఖ హోదా కూడా అనుమతి, అంగీకారం పొందుతామనే హామీ ఇవ్వదు. 

ఈ విచిత్రమైన ఈ వాస్తవికతను ఇటీవల సీనియర్‌ జర్నలిస్ట్‌ విశాల్‌ భార్గవ వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఇళ్ళు కొనడానికి ప్రయత్నించినప్పుడు బాలీవుడ్‌ సెలబ్రిటీలు తరచుగా అనధికారిక అడ్డంకులను ఎదుర్కొంటారని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు దివంగత బిలియనీర్, బాలీవుడ్‌ సినిమాలకు పెట్టుబడిదారు రాకేష్‌ జున్ జున్ వాలా కూడా ఈ ప్రాంతంలోని ఒక ఎలైట్‌ క్లబ్‌ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు.

‘ముంబై, మంచ్‌ అండ్‌ మార్కెట్‌ విత్‌ చింతన్‌ వాసని‘ పేరిట ఇన్‌స్ట్రాగామ్‌ ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడుతూ, టాటా చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ వంటి ప్రముఖులకు నిలయంగా, ‘ధనవంతులు, అంతకు మించిన సూపర్‌ రిచ్‌ల‘ డొమైన్‌గా పెడ్డర్‌ రోడ్‌ను అభివర్ణించారు. కానీ, సెలబ్రిటీలను ఎదురేగి ఆహ్వానించే, స్వీకరించే బాంద్రా మాదిరిగా కాకుండా, పెడ్డర్‌ రోడ్‌ సొసైటీలు తరచుగా బాలీవుడ్‌ నటులను తమకు పెద్ద న్యూసెన్స్‌లా చూస్తాయి, అక్కడ ఆస్తిని కొనుగోలు చేసే వారికి అనధికారిక పరిమితులను విధిస్తాయి అంటూ ఆశ్చర్యపరిచే నిజాలను ఆయన వెల్లడించారు.

ఈ ప్రత్యేకత నివాస సొసైటీలతో పాటు విందు వినోద కేంద్రాలకు సైతం విస్తరించింది. దీనికి ఈ రోడ్‌లోని ఒక ప్రముఖ సంస్థ అయిన విల్లింగ్‌డన్‌ క్లబ్‌ను భార్గవ దీనికి ఉదహరించారు. ‘వారు బాలీవుడ్‌ నటులను ఇష్టపడరు, అంతేకాదు వారు అత్యున్నత విద్యావంతులు తప్ప ఇతరత్రా తమను తాము ఉన్నతంగా భావించే ఎవరినీ ఇష్టపడరు‘ అని ఆయన వివరించారు. భారత స్టాక్‌ మార్కెట్‌లో పేరొందిన ‘బిగ్‌ బుల్‌‘ అయిన జున్ జున్ వాలా ఆ ప్రాంతంలోని విల్లింగ్‌డన్‌ క్లబ్‌లో సభ్యత్వం పొందడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన అభ్యర్ధనను క్లబ్‌ ఏకంగా మూడుసార్లు తిరస్కరించడం జరిగిందని కూడా భార్గవ వెల్లడించారు.

‘మీ దగ్గర డబ్బు ఉందడం ప్రాధాన్యత కాదు, పెద్దర్‌ రోడ్‌లో నివసించాలంటే డబ్బు కు మించిన విలువ ఏదైనా ఉండాలి‘ అని భార్గవ నొక్కిచెప్పారు. ‘ధనవంతులు సూపర్‌ రిచ్‌‘ గా ఉండటం చాలా సార్లు అర్హతగా మారుతుందని అయితే, ‘ధనవంతులు. ప్రముఖులు‘ గా ఉండటం అక్కడ అనర్హత అని ఆయన వివరించారు. బదులుగా, ‘ధనవంతులు అత్యంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తులు ఈ అల్ట్రాఎక్స్‌క్లూజివ్‌ ఆవరణలో ప్రవేశం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారాయన.

గత 2022లో ఆగస్టు 14 వ తేదీన తన 62 సంవత్సరాల వయసులో మరణించిన జున్ జున్ వాలా తన సామ్రాజ్యాన్ని రూ.5,000 పెట్టుబడి నుంచి 5.5 బిలియన్ల సంపదకు నిర్మించుకున్నారు. చురుకైన పెట్టుబడి వ్యూహాలతో ‘వారెన్‌ బఫెట్‌ ఆఫ్‌ ఇండియా‘ గా ప్రసిద్ధి చెందారు. అంతటి ప్రముఖ వ్యక్తి సైతం ఒక క్లబ్‌ సభ్యత్వం పొందలేకపోయారనే వాస్తవం వెల్లడి కావడం ముంబైలోని పెడ్డర్‌ రోడ్‌ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement