breaking news
Peddar Road flyover
-
బాలీవుడ్ న్యూసెన్స్‌కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి అనుమతి ఉండదు
డబ్బుoటే కొండ మీద కోతి దిగొస్తుంది అంటారు అదేమో గానీ ఒక్కోసారి మనకు కావాల్సిన చోట, కోరుకున్నవారి మధ్య నివాసం కూడా పొందలేమని నిరూపితమవుతోంది. భారతదేశపు వాణిజ్య రాజధాని నగరమైన ముంబైలో సంపద ఉండడం అనేది వారి స్థాయిని నిర్దేశించే ఒక ప్రధాన అంశం, అయితే ఆ నగరంలోని కొన్ని ప్రాంతాలలో విస్తుపోయేలా దీనికి అతీతమైన ధోరణి కనిపిస్తుంది. అటువంటి ఒక ప్రాంతం, పెడ్డర్ రోడ్, ఈ రోడ్ సంపదకు మాత్రమే కాకుండా దానికే స్వంతమైన ఆలోచనల ద్వారా కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఇక్కడ నివాసాలకు అపారమైన సంపద లేదా ప్రముఖ హోదా కూడా అనుమతి, అంగీకారం పొందుతామనే హామీ ఇవ్వదు. ఈ విచిత్రమైన ఈ వాస్తవికతను ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ విశాల్ భార్గవ వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఇళ్ళు కొనడానికి ప్రయత్నించినప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా అనధికారిక అడ్డంకులను ఎదుర్కొంటారని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు దివంగత బిలియనీర్, బాలీవుడ్ సినిమాలకు పెట్టుబడిదారు రాకేష్ జున్ జున్ వాలా కూడా ఈ ప్రాంతంలోని ఒక ఎలైట్ క్లబ్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు.‘ముంబై, మంచ్ అండ్ మార్కెట్ విత్ చింతన్ వాసని‘ పేరిట ఇన్‌స్ట్రాగామ్ ఎపిసోడ్లో ఆయన మాట్లాడుతూ, టాటా చైర్మన్ ముఖేష్ అంబానీ వంటి ప్రముఖులకు నిలయంగా, ‘ధనవంతులు, అంతకు మించిన సూపర్ రిచ్‌ల‘ డొమైన్‌గా పెడ్డర్ రోడ్‌ను అభివర్ణించారు. కానీ, సెలబ్రిటీలను ఎదురేగి ఆహ్వానించే, స్వీకరించే బాంద్రా మాదిరిగా కాకుండా, పెడ్డర్ రోడ్ సొసైటీలు తరచుగా బాలీవుడ్ నటులను తమకు పెద్ద న్యూసెన్స్‌లా చూస్తాయి, అక్కడ ఆస్తిని కొనుగోలు చేసే వారికి అనధికారిక పరిమితులను విధిస్తాయి అంటూ ఆశ్చర్యపరిచే నిజాలను ఆయన వెల్లడించారు.ఈ ప్రత్యేకత నివాస సొసైటీలతో పాటు విందు వినోద కేంద్రాలకు సైతం విస్తరించింది. దీనికి ఈ రోడ్‌లోని ఒక ప్రముఖ సంస్థ అయిన విల్లింగ్డన్ క్లబ్‌ను భార్గవ దీనికి ఉదహరించారు. ‘వారు బాలీవుడ్ నటులను ఇష్టపడరు, అంతేకాదు వారు అత్యున్నత విద్యావంతులు తప్ప ఇతరత్రా తమను తాము ఉన్నతంగా భావించే ఎవరినీ ఇష్టపడరు‘ అని ఆయన వివరించారు. భారత స్టాక్ మార్కెట్లో పేరొందిన ‘బిగ్ బుల్‘ అయిన జున్ జున్ వాలా ఆ ప్రాంతంలోని విల్లింగ్డన్ క్లబ్లో సభ్యత్వం పొందడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన అభ్యర్ధనను క్లబ్ ఏకంగా మూడుసార్లు తిరస్కరించడం జరిగిందని కూడా భార్గవ వెల్లడించారు.‘మీ దగ్గర డబ్బు ఉందడం ప్రాధాన్యత కాదు, పెద్దర్ రోడ్లో నివసించాలంటే డబ్బు కు మించిన విలువ ఏదైనా ఉండాలి‘ అని భార్గవ నొక్కిచెప్పారు. ‘ధనవంతులు సూపర్ రిచ్‘ గా ఉండటం చాలా సార్లు అర్హతగా మారుతుందని అయితే, ‘ధనవంతులు. ప్రముఖులు‘ గా ఉండటం అక్కడ అనర్హత అని ఆయన వివరించారు. బదులుగా, ‘ధనవంతులు అత్యంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తులు ఈ అల్ట్రా–ఎక్స్‌క్లూజివ్ ఆవరణలో ప్రవేశం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారాయన.గత 2022లో ఆగస్టు 14 వ తేదీన తన 62 సంవత్సరాల వయసులో మరణించిన జున్ జున్ వాలా తన సామ్రాజ్యాన్ని రూ.5,000 పెట్టుబడి నుంచి 5.5 బిలియన్ల సంపదకు నిర్మించుకున్నారు. చురుకైన పెట్టుబడి వ్యూహాలతో ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా‘ గా ప్రసిద్ధి చెందారు. అంతటి ప్రముఖ వ్యక్తి సైతం ఒక క్లబ్ సభ్యత్వం పొందలేకపోయారనే వాస్తవం వెల్లడి కావడం ముంబైలోని పెడ్డర్ రోడ్ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది. View this post on Instagram A post shared by Chintan Vasani️ (@chintanvasani) -
పేడర్ రోడ్డు ఫ్లైఓవర్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, ముంబై: ఎట్టకేలకు పేడర్ రోడ్ వంతెనకు మార్గం సగమమైంది. వివిధ కారణాల వల్ల గత పదేళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ) అంటున్నారు. దక్షిణ ముంబైలో ఎదురవుతున్న ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించాలంటే ఇరుకుగా ఉన్న పేడర్ రోడ్‌ను విస్తరించాలి. కానీ అది సాధ్యమయ్యే పనికాకపోవడంతో ఫ్లై ఓవర్ అంశం తెరమీదకు వచ్చింది. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇక్కడ వంతెన నిర్మించడాన్ని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కుటుంబం, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో గత పదేళ్లుగా ఈ ప్రాజెక్టు పెండింగులో పడిపోయింది. వారిని నచ్చజెప్పేందుకు స్థానిక రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు ఎంఎస్ఆర్డీసీ జోక్యం చేసుకుని స్థానికులతో ప్రజా దర్భార్ ఏర్పాటుచేసి వారిలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసింది. స్థానికులు వెల్లడించిన అభిప్రాయాలకనుగుణంగా ఈ ప్రాజెక్టు ప్రణాళికలో అనేక మార్పులు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ సూచించింది. దీని ప్రకారం చర్నిరోడ్ సముద్ర తీరానికి సమీపంలో వంతెనకు నాలుగు పిల్లర్లు వేయాలి. దీనికి సీఆర్‌జెడ్ అడ్డురావడంతో పర్యావరణ శాఖ అభ్యంతరంతెలిపింది. దీంతో రెండు పిల్లర్లకు కుదించారు. దీంతో పర్యావరణ శాఖ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే అధికారులు సమావేశమై టెండర్ల ప్రక్రియకు తుది మెరుగులు దిద్దనున్నారు. ఇక ప్రత్యక్షంగా పనులు ప్రారంభమవుతాయని ఎంఎస్ఆర్డీసీ వర్గాలు తెలిపాయి. ‘ఈ ప్రాజెక్టులో భాగంగా పేడర్ రోడ్‌పై హాజీఅలీ జంక్షన్ నుంచి విల్సన్ కాలేజీ వరకు 3.9 కి.మీ. ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారు. ప్రస్తుతం ట్రాఫిక్‌లో ఈ దూరాన్ని చేధించాలంటే కనీసం 20 నుంచి 25 నిమిషాల సమయం తీసుకుంటోంది. ఫ్లై ఓవర్ వినియోగంలోకి వస్తే కేవలం ఏడు నిమిషాల్లోనే చేరుకోవచ్చ’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. సాధారణ ప్రజలతోపాటు మంత్రులు, వీఐపీలు, ఇతర రంగాల ప్రముఖుల వాహనాల ఇంధనంతోపాటు విలువైన సమయం ఆదా అవుతుందన్నారు.