'ముఖ్య గమనిక' సినిమా రివ్యూ | Mukhya Gamanika Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Mukhya Gamanika Review In Teugu: 'ముఖ్య గమనిక' మూవీ రివ్యూ

Feb 23 2024 10:12 PM | Updated on Feb 24 2024 9:31 AM

Mukhya Gamanika Movie Review And Rating Telugu - Sakshi

అ‍ల్లు అర్జున్ మేనమామ కొడుకు విరాన్ హీరోగా నటించిన సినిమా 'ముఖ్య గమనిక'. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ సినిమాని శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో ఓ మాదిరి అంచనాలు పెంచిన ఈ చిత్రం..తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
విరాన్(విరాన్ ముత్తంశెట్టి) ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు. తం‍డ్రిని ఎవరో హత్య చేయడంతో ఆ ఉద్యోగం విరాన్‌కి వస్తుంది. అయితే విరాన్ తండ్రితో పాటు చాలామంది పోలీసులు ఊహించని విధంగా హత్యకి గురవుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న మిస్టరీని చేధించాలని విరాన్ డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి తన తండ్రి చనిపోయిన రోజునే మిస్ అయిన ఓ ఆర్.జె.కేసు ఎదురవుతుంది. అతను ఎలా మిస్ అయ్యాడు? దాని వెనుక అతని భార్య హస్తం ఉందా? అసలు ఆర్.జె మిస్సింగ్ కేసుకి విరాన్ తండ్రి హత్యకి సంబంధం ఏంటి? చివరికి విరాన్ ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి హంతకుడిని పట్టుకున్నాడా? లేదా? అనేది స్టోరీ.

ఎలా ఉందంటే?
దర్శకుడు వేణు ముర‌ళీధ‌ర్ తీసుకున్న కథ, కథనం బాగానే ఉంది. కానీ అనుకున్న స్టోరీని తెరపైకి తీసుకురావడంలో కాస్త తడబడ్డారు. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ ఓ మాదిరి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. రెండు డిఫరెంట్ క్రైమ్ ఎలిమెంట్స్‌ని ఒకే స్టోరీలో చెప్పి మెప్పించారు. కాకపోతే సగటు ప్రేక్షకుడు ఈ సినిమాని ఎంతవరకు ఆదరిస్తాడనేది చూడాలి. 

ఎవరెలా చేశారంటే?
హీరో విరాన్ ఎంచుకున్న సబ్జెక్ట్ బాగుంది. నటుడిగా ఇంప్రూవ్ కావాలి. హీరోయిన్ లావణ్య తన పాత్రకి న్యాయం చేసింది. ఆర్.జె.రోల్ చేసిన నటుడు, అతని భార్యగా చేసిన ఆర్యన్ ఇప్పిల్లి బాగా నటించారు. వీరిద్దరికీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా వుంది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ గ్రిప్పింగ్‌గా వుండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement