Mrunal Thakur: రెండు వారాలు వేశ్య గృహంలో ఉన్నా: మృణాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mrunal Thakur Said She Stayed In Prostitute House For Two Weeks - Sakshi

మృణాల్‌ ఠాకుర్‌.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సీతారామం మూవీతో రాత్రికిరాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. ఈ చిత్రంలో యువరాణిగా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో మృణాల్‌లో తొలి బిగ్గెస్ట్‌ కమర్శియల్‌ హిట్‌ అందుకుంది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె మొదట బుల్లితెర నటిగా ప్రేక్షకులకు పరిచయమైంది. హిందీతో పాటు తెలుగలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్‌తో నటిగా గుర్తింపు పొందింది.

చదవండి: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే

ఆ తర్వాత హిందీ చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ హీరోయిన్‌గా మారింది. ఈ జర్నీలో తాను ఎన్నో స్ట్రగుల్స్‌ పడ్డానంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. తాను మొదట సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు చెప్పింది. కానీ చివరకు చిత్రం నుంచి తనని తొలగించారని చెప్పింది. ఈ సందర్భంగా మృణాల్‌ మాట్లాడుతూ.. ‘సుల్తాన్‌ చిత్రంలో అనుష్క శర్మ చేసిన పాత్రలో నేను నటించాల్సింది. ఈ సినిమా కోసం ఫైటింగ్‌లో కూడా శిక్షణ తీసుకున్నా. 11 కిలోల బరువు కూడా తగ్గాను.

కానీ ఏమైందో ఏమో ఆ సినిమా నుంచి నన్ను తొలగించి అనుష్క శర్మను తీసుకున్నారు. దానికి కచ్చితమైన కారణం తెలియదు కానీ, నేను ఎక్కువ బరువు తగ్గడమే దానికి కారణమని ఆ తర్వాత తెలిసింది’ అని చెప్పింది. ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ వచ్చిందని, ఈ సినిమా కోసం తాను రెండు వారాల పాటు వేశ్య గృహంలో ఉండాల్సి వచ్చిందంటూ షాకింగ్‌ విషయం చెప్పింది మృణాల్‌. ‘నేను చేసిన లవ్‌ సోనియాలో అక్రమ రావాణకు గురైన చెల్లిని రక్షించుకునే అక్క పాత్ర నాది. దానికి కోసం నేను వేశ్యగా మారాల్సి ఉంటుంది. 

చదవండి: యూట్యూబ్‌ ద్వారా గంగవ్వ నెల సంపాదన ఎంతంటే

నా పాత్ర సహజంగా  వచ్చేందుకు కోల్‌కతాలోని వేశ్య గృహంలో రెండు వారాల పాటు ఉన్నాను. అక్కడ వాళ్ళతో గడిపి వారి కథలు విన్నాను. వారి గురించి వింటుంటే నా గుండె చలించిపోయింది. ఆ తర్వాత ఎప్పడు నాకు వాళ్లే గుర్తోచ్చేవారు. ఆ సమయంలో డిప్రషన్‌లోకి కూడా వెళ్లాను. షూటింగ్‌ చేస్తున్నప్పుడు కూడా వారే గుర్తొచ్చేవారు. 17 ఏళ్ల అమ్మాయిని 60 ఏళ్ల వృద్ధుడికి అమ్మే సన్నివేశమది. ఆ సీన్‌ చేస్తుంటే వేశ్యల కథలే కళ్ళముందు కదిలాయి. దీంతో నేను చేయలేను అంటూ ఏడ్చేశాను. కానీ డైరెక్టర్‌ నువ్వు ఈ సీన్‌ చేస్తే ప్రపంచం చూస్తుంది అని నాకు కౌన్సిలింగ్‌ ఇచ్చేశారు. ఆయన మాటలతో ధైర్యం తెచ్చుకుని యాక్ట్‌ చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top