మరోసారి వెనక్కు తగ్గిన మోహన్‌లాల్‌ | Sakshi
Sakshi News home page

ఓనమ్‌కి వస్తోన్న ‘మరక్కర్‌'

Published Wed, Apr 28 2021 8:16 AM

Mohanlals Marakkar Movie Release Date Postponed To Onam - Sakshi

మోహన్‌లాల్‌ నటించిన తాజా చిత్రం ‘మరక్కర్‌: లయన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సీ’ విడుదల మరోసారి వాయిదా పడింది. 2020 మార్చి 26న విడుదలకు షెడ్యూల్‌ అయిన ఈ చిత్రం కరోనా కారణంగా ఈ ఏడాది వేసవికి వాయిదా పడింది. తాజాగా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ‘మరక్కర్‌’ సినిమాను ఓనమ్‌ పండగ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మంగళవారం మోహన్‌లాల్‌ అధికారికంగా ప్రకటించారు.

ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్‌ మోహన్‌లాల్‌ (మోహన్‌లాల్‌ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. 16వ శతాబ్దానికి చెందిన నేవల్‌ కమాండర్‌ కుంజాలి మరక్కర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే... తాజా జాతీయ అవార్డుల్లో ‘మరక్కర్‌’ సినిమా మూడు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌) అవార్డులు సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement