
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'ఎల్ 2: ఎంపురన్'. గతంలో రిలీజైన 'లూసిఫర్' చిత్రానికి ఇది సీక్వెల్. కాకపోతే అప్పట్లో తక్కువ బడ్జెట్ తో సింపుల్ గా తీశారు. ఇప్పుడు భారీగా తీశారు. మార్చి 27న థియేటర్లలోకి రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ.. రిలీజ్ కి ముందే కళ్లు చెదిరే వసూళ్లు సాధిస్తుండటం విశేషం.
(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)
మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. లూసిఫర్ చిత్రాన్ని అప్పట్లో మలయాళంతో పాటు తెలుగులోనూ డబ్బింగ్ చేశారు. కాకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బడ్జెట్ గట్టిగానే పెట్టి సినిమా భారీగా తీశారు. అంతే భారీగా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
తెలుగులో దిల్ రాజు.. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రీ సేల్స్ ద్వారానే దాదాపు రూ.58 కోట్ల వరకు సొంతం చేసుకుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తెలుగులో ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. దీనికి విక్రమ్ 'వీరధీర శూర', 'మ్యాడ్ స్క్వేర్', 'రాబిన్ హుడ్' చిత్రాలు పోటీగా ఉన్నాయి. మరి తెలుగులో మోహన్ లాల్ మూవీ ఏం రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్)
