Report Says Billionaire Rupert Murdoch And Actress Jerry Hall Set To Divorce - Sakshi
Sakshi News home page

Jerry Hall- Rupert Murdoch: పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్‌ విడాకులు!

Jun 23 2022 2:39 PM | Updated on Jun 23 2022 3:08 PM

Model Jerry Hall And Media Mogul Rupert Murdoch Set To Divorce - Sakshi

ప్రస్తుతం 91 ఏళ్ల వయసున్న రూపర్ట్‌ ఇప్పుడు ఆమెకు కూడా విడాకులిస్తుండటం గమనార్హం. ఇక జెర్రీ హాల్‌ విషయానికి వస్తే ఆమె బ్యాట్‌మన్‌, ద గ్రాడ్యుయేట్‌ వంటి చిత్రాల్లో నటించింది..

పెళ్లిని నూరేళ్ల పంటగా అభివర్ణించారు పెద్దలు. కానీ ఈ కాలంలో మాత్రం ఈ మూడు ముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. కొన్ని నెలలు లేదా సంవత్సరాలకే నువ్వు నాకొద్దు బాబోయ్‌ అంటూ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో పెళ్లి, విడాకులు సర్వసాధారణమయ్యాయి. తాజాగా మీడియా మొఘల్‌ రూపర్ట్‌ ముదోర్చ్‌, మోడల్‌, నటి జెర్రీ హాల్‌ వివాహ బంధానికి స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కలిసి ఉండలేమంటూ విడాకులు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

ఫాక్స్‌ కంపెనీ చైర్మన్‌, సీఈవో అయిన రూపర్ట్‌కు ఇదివరకే మూడు విడాకులు కాగా ఇది నాలుగవది. 1956లో అతడు పార్టీసియా బుకర్‌ను పెళ్లి చేసుకున్నాడు. 1967లో ఆమెకు విడాకులిచ్చేసి అదే ఏడాది అన్నా మరియాను వివాహమాడాడు. 32 ఏళ్ల పాటు ఆమెతో కలిసున్న అతడు 1999లో వెండి డెంగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2013లో ఆమెకు కూడా విడాకులిచ్చేశాడు. అనంతరం 2016లో మోడల్‌, నటి జెర్రీని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం 91 ఏళ్ల వయసున్న రూపర్ట్‌ ఇప్పుడు ఆమెకు కూడా విడాకులిస్తుండటం గమనార్హం. ఇక జెర్రీ హాల్‌ విషయానికి వస్తే ఆమె బ్యాట్‌మన్‌, ద గ్రాడ్యుయేట్‌ వంటి చిత్రాల్లో నటించింది. గతంలో సింగర్‌ మిక్‌ జాగర్‌ను పెళ్లాడిన ఆమె తర్వాత అతడితో విడిపోయింది. ఈ పెళ్లిళ్ల ద్వారా రూపర్ట్‌, జెర్రీలకు మొత్తం 10 మంది పిల్లలున్నారు.

చదవండి: అప్పుడు కాలర్‌ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు
యంగ్‌ హీరో సినిమాపై తలైవా పొగడ్తల వర్షం

Advertisement
 
Advertisement
Advertisement