MLA RK Roja Nagari Home Tour Video Goes Viral - Sakshi
Sakshi News home page

Actress Roja: నటి, ఎమ్మెల్యే రోజా హోంటూర్‌.. అచ్చంగా ఇంద్రభవనమే

Feb 8 2022 1:51 PM | Updated on Feb 8 2022 4:36 PM

MLA RK Roja Nagari Home Tour Video Goes Viral - Sakshi

MLA RK Roja Nagari Home Tour Video Goes Viral: ఒక పక్క రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే, మరోపక్క బుల్లితెర హోస్ట్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఈమధ్య సినిమాలకు కాస్త విరామం ఇచ్చినా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమం కోసం రోజా తన హెమ్‌ టూర్‌ని రిలీజ్‌ చేశారు.

ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీలు యూట్యూబ్‌ వేదికగా తమ ఇంటిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కానీ ఫర్‌ ది ఫస్ట్‌ టైం రోజా తన హోం టూర్‌ని మాత్రం ఏకంగా టీవీలోనే విడుదల చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. నగరిలో ఇంద్ర భవనం లాంటి తన సొంతింటిని ఎమ్మెల్యే రోజా ప్రేక్షకులకు పరిచయం చేశారు.

వెంకటేశ్వర స్వామి ఫోటోతో ఇంట్లోకి స్వాగతం పలికిన రోజా అనంతరం పూజాగది, బెడ్‌ రూమ్‌, హాల్‌, పిల్లల రూమ్స్ సహా కొన్ని అపురూపమైన ఫోటోలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంతో విశాలవంతమైన, ఇంద్రభవనం లాంటి రోజా ఇంటిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

చదవండి: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముక్‌.. ఆమెతో కలిసి గృహప్రవేశం

Advertisement
 
Advertisement
Advertisement