
శ్వేతా అవస్తీ
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా, శ్వేతా అవస్తీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్ .కె దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పవన్ కుమార్ .కె మాట్లాడుతూ–‘‘కామెడీ, లవ్, ఎమోష¯Œ ్సతో కూడిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు వెంకటేష్ కొత్తూరి.