
హీరో ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’... ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చిన సమయం నుంచి ఎలాంటి వార్త వచ్చినా సరే క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో వస్తున్న తాజా నివేదికల ప్రకారం.. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ఇప్పటికే ఆయన డేట్స్ ఇచ్చారని, ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఆయన కనిపిస్తారని సమాచారం. ఇందులో ఆయన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని టాక్. సందీప్‌రెడ్డి యానిమల్ సినిమాలో కూడా తండ్రి పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యతే ఉంటుంది. ఇదే క్రమంలోనే స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఫాదర్ పాత్రకు కూడా ఎక్కువ స్పేస్ ఉంటుందని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. సందీప్ రెడ్డికి ఇష్టమైన నటుడు చిరంజీవి ఆయనతో ఒక ఫుల్ లెన్త్ సినిమా ఛాన్స్ వస్తే చేయాలని ఉందని కూడా చెప్పారు. ఇంతలో ఇలా స్పిరిట్‌లో చిరు భాగమైతే ఆయన సంతోషానికి హద్దులు ఉండవని చెప్పవచ్చు. సందీప్ ఆఫీస్‌తో పాటు తన ఇంట్లో కూడా చిరు ఫోటో ఉంటుంది. అంతలా మెగాస్టార్‌ను సందీప్‌రెడ్డి ఇష్టపడుతాడు.

చిరంజీవి కూడా సందీప్, ప్రభాస్ ఇద్దరినీ చాలా ఇష్టపడుతారు. ఈ కాంబినేషన్ సెల్యులాయిడ్‌పై స్థిరపడితే.. ఇంకేముంది బాక్సాఫీస్ కలెక్షన్స్ మోత మోగాల్సిందే.. ఈ కాంబినేషన్ సినిమా వ్యాపారం పరంగా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో చాలామందిని ఆకర్షిస్తుంది. అదనంగా, ఈ చిత్రంలో ప్రభాస్, సంజయ్ దత్ అన్నదమ్ములుగా కనిపిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. వారిద్దరూ ఇప్పటికే రాజా సాబ్ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు, అందరి మనస్సులో వచ్చే పెద్ద ప్రశ్న ఏమిటంటే, చిరంజీవి ఈ చిత్రంలో భాగం కావడానికి ఖచ్చితంగా అంగీకరిస్తారా? ఇదే సందేహం చాలామందిలో ఉంది. నిజమే అయితే, ఫ్యాన్స్‌కు పండగే అవుతుంది. ప్రస్తుతానికి విశ్వంభర, మన శంకర వర ప్రసాద్ సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, సందీప్ కాంబినేషన్‌లో ఒక సినిమా రానుందన కూడా కొద్దిరోజులుగా ప్రచారం ఉంది. అయితే, పెద్ది సినిమా తర్వాత ఈ మూవీ ఉంటుందని టాక్.