వారికి మెగాస్టార్ చిరు సలహా.. ట్వీట్ వైరల్! | Megastar Chiranjeevi Tweet Goes Viral On Bangalore Water Crisis | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: కన్నడలో ట్వీట్ చేసిన మెగాస్టార్.. ఎందుకంటే?

Mar 27 2024 4:05 PM | Updated on Mar 27 2024 4:24 PM

Megastar Chiranjeevi Tweet Goes Viral On Bangalore Water Crisis - Sakshi

మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి నేపథ్యంలో చిరు సలహా ఇచ్చారు. నీటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో ‍అవలంభించిన పద్ధతులను వివరించారు. తన ఫామ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఫోటోలను పంచుకున్నారు. అంతే కాకుండా తన ట్వీట్‌లో కన్నడ భాషలో రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

(ఇది చదవండి: చిరంజీవి రెండుసార్లు అడిగినా నో చెప్పిన హీరో.. ఎవరంటే?)

కాగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది.  ఈ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. 2006లో వచ్చిన స్టాలిన్ తర్వాత త్రిష మరోసారి చిరంజీవితో జతకట్టనుంది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement