ఆచార్య ఫస్ట్‌ సాంగ్: సీనియర్‌ నటి స్పెషల్‌‌‌ అట్రాక్షన్‌

Megastar Chiranjeevi Acharya Movie First Song Out - Sakshi

మెగా అభిమానులకు సర్‌ప్రైజ్‌. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నిరంజన్‌  రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. చెర్రి ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిరంజీవి 152వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ జనవరి 29 విడుదలైన సంగతి తెలిసిందే. రీలిజైన క్షణాల్లోనే టీజర్‌ లక్షవ్యూస్‌ సంపాదించి యూట్యూబ్‌ సంచలనమైంది. బ్యాక్‌గ్రౌండ్‌లో‌ చెర్రి వాయిస్‌ వస్తుండగా చీరు ఎంట్రీ ఇచ్చిన ఈ టీజర్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. 

ఈ క్రమంలో ఆచార్యలోని మొదటి లిరికల్‌ సాంగ్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం. ‘లాహే లాహే’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇందులో సీనియర్‌ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఆమెతో కలిసి కాలు కదిపింది. గుడి సమీపంలో సాగే ఈ పాటకు మధ్యలో చిరు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. కాగా గేయ రచయిత  రామజోగయ్య శాస్రీ సాహిత్యం‌ అందించగా.. మణిశర్మ స్వరాలు సమకుర్చారు.  సింగర్స్‌ హరిక నారాయణ్‌, సాహితి చాగంటిలు ఆలపించిన ఈ పాటకు దినేష్‌ కొరియోగ్రాఫి అందించాడు.

చదవండి: 
మెగాస్టార్‌ ఆన్‌ ద వే.. మే 13కు 'ఆచార్య' రెడీ
మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top