Prabhas : హైదరాబాద్‌లో ప్రభాస్ షూటింగ్.. 40కోట్లతో సెట్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం దాదాపు నలభై కోట్ల రూపాయలతో నాలుగు సెట్స్‌ని రూపొందించారని సమాచారం.
ప్రస్తుతం భారీ స్థాయిలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ ఫైట్స్ కోసం ఇతర దేశాల నుంచి ఫైటర్స్‌ను రంగంలోకి దించారట నాగ్ అశ్విన్. అలాగే ఈ నెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు దీపికా పదుకోన్. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ 2024లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.