Vishal And SJ Suryah Mark Antony Release On This Occasion - Sakshi
Sakshi News home page

Mark Antony Movie: విశాల్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Jul 11 2023 6:35 PM | Updated on Jul 11 2023 6:42 PM

Mark Antony Movie Release Date Vishal - Sakshi

హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంథోని'గా వచ్చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీసిన ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రీతూవర్మ నటించింది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ప్రస్తుతం తుదిదశ పనుల‍్లో ఉన్న ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు.

(ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?)

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న 'మార్క్ ఆంథోని' విడుదలవుతుందని, రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో మెయిన్ లీడ్స్ అందరూ సరికొత్త రెట్రో లుక్ తో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఇటీవల రిలీజైన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. విశాల్ ఇందులో సరికొత్తగా కనిపించారు. 

గుబురు గడ్డంతో ఫైర్ చేస్తున్న విశాల్ లుక్, ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. జీవీ ప్రకాష్ సంగీతమందించారు. 'మార్క్ ఆంథోని'.. టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథ. భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో, అక్కడక్కడ ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్‌తో ఈ చిత్రం ఆద్యంతం అందరినీ అలరించనుంది. 

(ఇదీ చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement