టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ టాలీవుడ్ మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మనోజ్.. ప్రేమ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రేమకథ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ పాటను ప్రస్తావిస్తూ తన లవ్ ప్రపోజల్‌ను రివీల్ చేశారు. రాజ్యమేదీ లేదుగానీ రాణిలాగా చూసుకుంటాననే లిరిక్ తన నచ్చిందని మనోజ్ తెలిపారు. ప్రపంచంలో ఎలాంటి తారతమ్యాలు లేనిది ఒక్క ప్రేమ మాత్రమేనన్నారు. రాజా వెడ్స్ రాంబాయి అనే మూవీ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మనోజ్ తన ప్రేమ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.
నేను కూడా ఫస్ట్ మౌనికను కలిసినప్పుడు ఓ మాట ఇచ్చానని మనోజ్ వెల్లడించారు. నాకు ఎలాంటి రాజ్యాలు లేవు.. నిన్ను బాగా చూసుకుంటానని చెప్పా.. సినిమాలు కూడా చేయట్లేదు.. జీవితాంతం నిన్ను చూసుకుంటానని మాట ఇచ్చా అని గుర్తు చేసుకున్నారు. ఎవరైనా సరే మనల్ని నమ్ముకుని వచ్చారంటే.. వారికోసం మన నిలబడాలి.. అలాంటి వాళ్ల చేయిని వదలకండి అని అన్నారు. శివుడు ఎక్కడో ఉండడు.. ఒకరి కోసం నిలబడినప్పుడు మీరు దేవుడిలా మారతారని పేర్కొన్నారు. ప్రాణముంటేనే శివ.. ప్రాణం లేకపోతే శవ.. శివుడు యాక్టివేట్ కావాలంటే పదిమంది కోసం మీరు నిలబడాలని పిలుపునిచ్చారు. మంచు మనోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Indiramma Intilo puttina, Indira Gandhi Intilo Puttina. Prema Andharidi
- #ManchuManoj at #RajuWedsRambai song launch event pic.twitter.com/qdJWP5I8CA— Suresh PRO (@SureshPRO_) November 4, 2025


