Manchu Lakshmi: మంచు లక్ష్మీ కూతురికి ప్రమాదం.. ఎలా జరిగిందంటే..!

manchu lakshmi daughter inured in mohan babu birthday - Sakshi

ఇటీవల మంచువారి ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే మంచు మనోజ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో విష్ణుతో విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ మనోజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో వివాదం తలెత్తింది. అయితే తాజాగా మంచు లక్ష్మీ కూతురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈనెల 19న మోహన్‌ బాబు బర్త్‌డే వేడుకల్లో ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా బయటకొచ్చింది. అయితే ఈ ప్రమాదంపై మంచు లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు. 

ఈ నెల 19న మా నాన్న పుట్టిన రోజు సందర్భంగా పిల్లలంతా బగ్గీలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. అది అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో పిల్లలు కిందపడిపోయారని వెల్లడించారు. ఆ సమయంలో మంచు లక్ష్మీ కూడా అక్కడే ఉన్నారు. ఆమె పక్కకు దూకేయగా.. పిల్లలంతా రోడ్డుపై పడిపోయారు. అప్పటికే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మొహం రక్తంతో నిండిపోయిందన్నారు. పాపని గుర్రపు బండి ఎక్కించకుండా ఉంటే బాగుండేదని మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. అయితే కుమార్తెతో కలిసి మంచు లక్ష‍్మీ తరచుగా వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు.
 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top