మహేష్ బాబు , రాజమౌళి (SS Rajamouli) సినిమాకు సంబంధించిన #GlobeTrotter ఈవెంట్ కోసం ప్రపంచదేశాల నుంచి కూడా ఆయన అభిమానులు హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది. పాస్‌పోర్ట్ మాదిరిగా ఉన్న పాస్‌లను ప్యాన్స్ కోసం జక్కన్న ఇప్పటికే జారీ చేశారు. అయితే, మహేష్ అభిమాని ఒకరు ఈ కార్యక్రమం కోసం ఏకంగా 6817 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు. అందుకు సంబంధించిన ఒక పోస్ట్‌ను రాజమౌళి కుమారుడు కార్తికేయ షేర్ చేశారు.
మహేష్ బాబుకు ఇతర దేశాల్లో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, సునీల్ ఆవుల అనే అభిమాని SSMB29 కార్యక్రమం కోసం సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత కేవలం మహేష్ కోసం వస్తున్నట్లు పేర్కొన్నాడు. అందుకోసం ఏకంగా 6817 కిలోమీటర్ల దూరం 12 గంటల పాటు ప్రయాణం చేశానన్నారు. తన పంచుకున్న పోస్ట్‌ను కార్తికేయ్ షేర్ చేశారు. ఒక తెలుగోడు మాత్రమే అనుభూతి చెందే బిగ్గెస్ట్ ఎమోషన్ ఇదే అని ఆపై ఆకాశం కూడా హద్దు కాదంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
OKKA TELUGODU MAAATRAME FEEL AYYE BIGGEST EMOTION….
SKY ALSO NOT THE LIMIT…. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 https://t.co/jH4eJniB0U— S S Karthikeya (@ssk1122) November 15, 2025


