Kollywood Actress Mahalakshmi Celebrates Ravindar Chandrasekaran Birthday, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Mahalakshmi-Ravindran Chandrasekaran: భర్తకు 6 అడుగుల గిఫ్ట్‌ ఇచ్చిన నటి

Jul 10 2023 9:39 AM | Updated on Jul 10 2023 10:22 AM

Mahalakshmi Celebrate Ravindar Chandrasekaran Birthday - Sakshi

తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి  పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ జంట పాపులర్‌ అయిపోయింది. దీనికి కారణం నిర్మాత రవీందర్‌ అతి బరువు ఉండటమే.  మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు  ట్రోల్‌ చేశారు. అంతేకాదు రవీందర్‌ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్‌ కూడా చేశారు నెటిజన్లు.

(ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్‌ అయిన హీరోయిన్‌)

వారి పెళ్లి అయి రెండేళ్లు దాటింది.. ఈ జర్నీలో వారిద్దరిపై భారీగానే ట్రోలింగ​ జరిగింది. ఒకసారి అయితే ఏకంగా ఈ జంట విడాకులు తీసుకుంటుందని ప్రచరాం జరిగింది. పెళ్లి అయి అన్నేళ్లైనా ఇంకా ఎందుకు తల్లివి కాలదేని ఇలా పలు రకాలుగా ఆ జంటపై పలు కామెంట్లు వచ్చేవి. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంతోషంగా ఉన్నామని బహిరంగానే ఆ జంట చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్‌తో అనిరుధ్ ప్రేమాయణం)

తాజాగా  రవీందర్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు 6 అడుగుల ప్రత్యేక బహుమతిని ఇచ్చి మహాలక్ష్మి  ఆశ్చర్య పరిచింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రత్యేక బహుమతి ఏమిటంటే... 6 అడుగుల ఎత్తు ఉన్న రవీంద్ర ఫోటోను చక్కటి పెయింటింగ్‌తో తయారు చేయించి తన భర్తకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది.

మహాలక్ష్మి  బర్త్‌డే విషెష్‌ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది. 'జీవితంలో నాకు మళ్లీ ధైర్యం తెచ్చిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరే నా బలం. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని.' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు లైక్‌లతో పాటు పాజిటివ్‌ కామెంట్లు పెట్టారు. పలువురు రవీందర్‌కు విషెస్‌ చెబుతూ.. చెత్తగ మాట్లాడే వారిని పట్టించుకోకుండా ఇలా సంతోషంగా జీవితంలో ముందుకు సాగాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement