మ్యాడ్ హీరో కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ | Mad Hero Ram Nithin Latest Movie First Look Poster out now | Sakshi
Sakshi News home page

Ram Nithin: మ్యాడ్ హీరో కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

Jun 4 2026 9:08 PM | Updated on Jun 4 2026 9:19 PM

Mad Hero Ram Nithin Latest Movie First Look Poster out now

మ్యాడ్ మూవీతో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ నితిన్. మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై  ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుందరకాండ ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవాళ హీరో రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్  పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ  స్పెషల్ పోస్టర్ కలర్ ఫుల్ కాలేజ్ ఫెస్ట్ వైబ్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. 'ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో యూత్‌ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు లిటిల్ హార్ట్స్ ఫేమ్ సింజిత్ యర్రమల్లి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement