బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు | Lyric Writer Vairamuthu Fulfills Late Bhagyaraj Last Wish After His Demise, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Bhagyaraj: భాగ్యరాజ్ చివరి కోరిక తీర్చిన రచయిత

Jul 7 2026 8:35 AM | Updated on Jul 7 2026 10:10 AM

Lyric Writer Vairamuthu Fulfil Bhagyaraj Last Wish

తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్.. అత్యుత్తమ కథా రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కి పైగా సినిమాల్లో నటించారు. అలాంటి ఈయన అకస్మాత్తుగా కొన్నిరోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. సినీ ప్రముఖుల దగ్గర నుంచి అభిమానుల వరకు నివాళి అర్పించారు. ఇకపోతే ఈయన ఎప్పటినుంచో కోరుకున్న విషయాన్ని ప్రముఖ రచయిత వైరముత్తు నెరవేర్చారు.

(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్)

ఇటీవల కన్నుమూసిన తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్.. గతంలో తన స్వీయచరిత్రాన్ని పుస్తకంగా రాశారు. దానికి ముందు మాట రాయాలని ప్రముఖ గీత రచయిత వైరముత్తుని కోరుతూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కానీ భాగ్యరాజ్ బతికుండగా అది జరగలేదని, ఇప్పుడు ఆ పుస్తకానికి ముందు మాట రాసి భాగ్యరాజ్ కోరికని నెరవేర్చినట్లు వైరముత్తు చెప్పారు. ఆయన భార్య పూర్ణిమ భాగ్యరాజ్, కొడుకు శాంతను భాగ్యరాజ్ కి సదరు ప్రతిని అందించినట్లు వెల్లడించారు.

భాగ్యరాజ్ చనిపోయిన తర్వాత ఆయన చివరి లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచండి. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. జీవితంతం నాకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై శాంతనుకు కూడా అందించండి. నేను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటాను' అని ఈయన రాసినట్లు అందులో ఉంది.

(ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లోకి స్టార్ హీరో ధనుష్.. ఎంట్రీ ఫిక్స్ అయిందా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement