రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. ఎంట్రీ ఫిక్స్..! | Kollywood Star Dhanush Political entry fans released official flag | Sakshi
Sakshi News home page

Dhanush: విజయ్ బాటలోనే ధనుశ్.. ఎంట్రీ ఫిక్స్..!

Jul 6 2026 8:00 PM | Updated on Jul 6 2026 8:22 PM

Kollywood Star Dhanush Political entry fans released official flag

తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ హీరో విజయ్ ప్రభంజనం సృష్టించాడు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్నారు. అత్యధిక సీట్లు గెలిచిన విజయ్.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. సినీ గ్లామర్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్.. కమల్ హాసన్‌ లాంటి స్టార్స్‌కు సాధ్యం కానీ ఫీట్ సాధించారు.

ఇక విజయ్ గెలుపుతో ద్రవిడ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సినీ స్టార్స్ వరుసగా రాజకీయ అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుశ్ సైతం ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఆయన అభిమాన సంఘం ఓ కార్యక్రమంలో అధికారిక జెండాను ఆవిష్కరించారు.  అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం ధనుశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారన్న వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.

దళపతి విజయ్ లాగే ధనుశ్ సైతం రాజకీయాల్లో అడుగు పెడతారనే చర్చ కోలీవుడ్‌లో ఊపందుకుంది. వచ్చే ఎన్నికల కల్లా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పక్కా ప్లాన్‌కో ఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తల వేళ.. ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement