breaking news
Tamil politcs
-
తమిళనాట 'ముఖ' రాజకీయం
తమిళనాట ఇప్పుడు ఫేస్ పాలిటిక్స్ నడుస్తోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడపాడి పళనిస్వామి తాజా 'ముఖ' రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన ముఖం దాచుకున్నారని ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే, నేనెందుకు ఫేస్ కవర్ చేసుకుంటానని పళనిస్వామి కౌంటర్ ఇస్తున్నారు. పళనిస్వామి ముఖం దాచుకోవాల్సిన అవసరం లేదని మిత్రపక్షం కమలం పార్టీ అంటోంది. కమలనాథుల కనుసన్నల్లోనే అన్నాడీఎంకే పార్టీ నడుస్తోందని, అందుకే రహస్యంగా అమిత్ షాను పళనిస్వామి కలిశారన్న ఆరోపణలు పత్యర్థుల నుంచి విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ రాజకీయం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.అసలేం జరిగింది? ఢిల్లీలో మంగళవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు పళనిస్వామి. భేటీ ముగిసిన తర్వాత బయటకు వెళుతూ కారులో ముఖానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రత్యర్థులు ఆయనపై విరుచుకుపడ్డారు. తన ముఖం కనిపించకుండా కవర్ చేయడానికే కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నారంటూ ఆరోపణలు చేశారు. సీఎం స్టాలిన్‌తో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్ (TTV Dinakaran) పలు ప్రశ్నలు సంధించారు. దినకరన్ ఒక అడుగు ముందుకేసి.. మాస్క్ పళనిస్వామి అంటూ ఎద్దేవా చేశారు.అన్నామలై ఏమన్నారంటే..ఈ వ్యవహారంపై బీజేపీ నాయకుడు కె అన్నామలై స్పందించారు. అమిత్ షా నివాసం నుంచి పళనిస్వామి ముఖం కప్పుకుని వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గురువారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన అధికారికంగా హోం మంత్రిని కలిసినందున అలాంటి అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాగా, దినకరన్‌ను మళ్లీ ఎన్డీఏలోకి ఆహ్వానించనున్నట్టు అన్నామలై వెల్లడించారు. దీని గురించి ఆయనతో ఫోన్లో మాట్లాడానని, త్వరలో స్వయంగా కలిసి ఎన్డీఏలోకి ఆహ్వానిస్తానని తెలిపారు.కర్చీఫ్‌తో ముఖం తడుచుకున్నా..అమిత్ షా ఇంటి నుంచి వస్తూ తాను ముఖం దాచుకున్న వైరల్ కావడంతో పళనిస్వామి తన పార్టీ నేతలతో కలిసి గురువారం మీడియా ముందుకు వచ్చి వివరణయిచ్చారు. తాను ముఖం దాచుకోలేదని, ఇదంతా స్టాలిన్ అనుకూల మీడియా సృష్టి అని పేర్కొన్నారు. కర్చీఫ్‌తో ముఖం తడుచుకుంటున్న వీడియోతో రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖం దాచుకోవాల్సిన అవసరం తనకు లేదని, అధికారికరంగానే కేంద్ర హోంమంత్రిని కలిసినట్టు చెప్పారు. చదవండి: సొంత పార్టీ నుంచి కొడుకును గెంటేసిన తండ్రిఅన్నాడీఎంకే పార్టీ వ్యవహారాల్లో బీజేపీ పెద్దల జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. తన గురించి మాట్లాడే అర్హత దినకరన్‌కు లేదని, ఒకప్పుడు ముసుగు వేసుకుని ఆయనే అన్నాడీఎంకేలోకి చొరబడ్డారని కౌంటర్ ఇచ్చారు. పళనిస్వామి (Palaniswami) వివరణతో ఫేస్ పాలిటిక్స్‌కు తెర పడుతుందా, లేదా అనేది చూడాలి. -
పార్టీ నుంచి కొడుకును గెంటేసిన తండ్రి
అనుకున్నదే జరిగింది. తండ్రికొడుకుల పవర్ పాలిటిక్స్ తారా స్థాయికి చేరాయి. తనకు కంట్లో నలుసులా తయారైన సొంత కొడుకుపై ఎట్టకేలకు చర్య తీసుకున్నారు రాజకీయ కురువృద్ధుడు డాక్టర్ ఎస్ రాందాస్. పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) పార్టీ నుంచి తన కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ అన్బుమణిని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు.విల్లుపురం జిల్లాలోని తైలపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. అన్బుమణిపై క్రమశిక్షణా కార్యాచరణ కమిటీ 16 అభియోగాలు మోపిందని తెలిపారు. వివరణ కోరుతూ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు అన్బుమణి స్పందించలేదని, గడువు పొడిగించినా కూడా ఆయన నుంచి సమాధానం రాలేదన్నారు. షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వడానికి ఆయన వద్ద సరైన సమాధానాలు లేకపోవడం వల్లే అన్బుమణి స్పందించలేదని భావిస్తున్నామన్నారు. పార్టీ నియమ నిబంధనల ప్రకారం ఆయనను.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగిస్తున్నామని, ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల కొంత మంది తన కొడుకుతో చేతులు కలిపారని, వారంతా తాను తయారు చేసిన నాయకులేనని.. వారిని క్షమించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.కొత్త పార్టీ పెట్టుకో..తన కుమారుడిని పీఎంకే నుంచి బహిష్కరించినా పార్టీకి ఎటువంటి నష్టం కలగబోదని రాందాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. పీఎంకే నుంచి తప్పించడంతో ఇప్పుడు అన్బుమణి సొంతంగా కొత్త పార్టీ (New party) పెట్టుకోవచ్చని సలహాయిచ్చారు. పీఎంకే తాను స్థాపించిన పార్టీ అని, దీనిపై తన కొడుకుతో సహా ఎవరికీ హక్కు లేదన్నారు.ఆ నిర్ణయం చెల్లదు: బాలుపీఎంకే పార్టీ నుంచి అన్బుమణిని బహిష్కరించడాన్ని ఆయన మద్దతుదారులు వ్యతిరేకించారు. రాందాస్ నిర్ణయం చెల్లదని అన్బుమణి మద్దతుదారుడు బాలు అన్నారు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీ నిబంధనల ప్రకారం.. సభ్యులను తొలగించడం, సమావేశాలు నిర్వహించడం, ఏవైనా నిర్ణయాలు తీసుకోవడం వంటి అధికారం జనరల్ కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడిన అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి, పార్టీ వ్యవస్థాపకుడు చేసిన ప్రకటన చెల్లద'ని ఆయన వాదించారు. మామల్లపురంలో ఆగస్టు 9న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా అన్బుమణి, ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్, కోశాధికారిగా ఎం. తిలగబామ మరో ఏడాది కొనసాగేందుకు ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించామని వెల్లడించారు. పార్టీ అంతర్గత ఎన్నికలు వచ్చే ఏడాది ఆగస్టులో జరుగుతాయన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశం ప్రకారం అన్బుమణి రాందాస్ (Anbumani Ramadoss) పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, మిగతా వారి మాటలు నమ్మెద్దని మీడియాను బాలు కోరారు.చదవండి: అన్నాడీఎంకే కలకలం.. రంగంలోకి అమిత్ షా!ఏం జరగబోతోంది?తాజా పరిస్థితుల నేపథ్యంలో పీఎంకే పార్టీలో ఏం జరగబోతోందనే చర్చ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి నుంచి అన్బుమణి పార్టీ లాగేసుకుంటారా లేదా కొత్త పార్టీ పెడతారా అనేది చూడాలి. అన్బుమణి చర్యలను బట్టి చూస్తే ఆయన పార్టీని హస్తగతం చూసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు పార్టీని తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు రాందాస్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ పేరు, జెండా, చిహ్నంను రక్షించుకునేందుకు బుధవారం నాడు మద్రాసు హైకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ తమదంటూ ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే ముందుగా తన వాదనలు వినాలని, తన వివరణ తప్పనిసరిగా స్వీకరించాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు. -
మంతనాల్లో సెంగోట్టయన్ బిజీ
సాక్షి, చైన్నె: గోబి చెట్టి పాళయంలోని తన నివాసంలో రాజకీయ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి మద్దతు దారులతో సెంగ్టోయన్ బుధవారం నుంచి మంతనాలలో మునిగారు. అందరి అభిప్రాయాలను స్వీకరిస్తూ వస్తున్నారు. ఆయన వద్దకు పెద్దసంఖ్యలో మద్దతు దారులు తరలి వస్తున్నారు. అన్నాడీఎంకేలో సమన్వయం, సమష్టి, ఐక్యత నినాదాన్ని అందుకున్న పదవులను సీనియర్ నేత సెంగోట్టయన్ పోగొట్టకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి చర్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సెంగ్టోయన్ మంగళవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్‌లను కలిసి వచ్చారు. ఢిల్లీ పెద్దల ముందు తన వాదనను, అభిప్రాయాలను ఉంచి ఈరోడ్‌కు వచ్చిన సెంగ్టోయన్ బుధవారం ఉదయం నుంచి పొద్దు పోయే వరకు మద్దతు దారులతో సమావేశాలతో బిజీ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ గురించి మద్దతు దారులతో మాట్లాడుతూ, వారి అభిప్రాయాలను సెంగోట్టయన్ స్వీకరిస్తూ వస్తున్నారు. అలాగే పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలందర్నీ ఒక చోట చేర్చే దిశగా పోన్ మంతనాలు సైతం ఆయా నేతలతో సాగుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. పళణి స్వామికి సెంగోట్టయన్ విధించిన పది రోజుల గడువు ఈనెల 15వతేదీ ముగియనుంది. ఆ తదుపరి సెంగోట్టయన్ పరిణామాలు, బాట ఎలా ఉంటుందో అన్న చర్చ ఊపందుకుంది.సూపర్ చైన్నె పోటీలకు దరఖాస్తుల ఆహ్వానంసాక్షి, చైన్నె : చైన్నె భవిష్యత్తును, సృజనాత్మకతను, అత్యాధునిక సాంకేతికతను ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (ఏఐ) కళా పోటీలకు అవకాశం కల్పించారు. రీ ఇమాజిన్ చైన్నె ఏఐ ఆర్ట్ ఎగ్జిభిషన్గా జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను బుధవారం సూపర్ చైన్నె ఎండీ రంజీత్ రాథోడ్ స్థానికంగా ప్రకటించారు. ఏఐ మేళవింపుతో చైన్నె భవిష్యత్తును ఊహించడం లక్ష్యంగా, నిరంతర అభివృద్ధిని కాంక్షిస్తూ స్కైలైన్ నుంచి శక్తి వంతమైన సంస్కృతి వరకు ఏఐ సాధానాల శక్తిగా వ్యక్తికరించే విధంగా జరగనున్న ఈ పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని, విశిష్ట ప్యానెల్ ద్వారా ఎంపిక చేసే టాప్ 25 కళాకృతులను ది ఏఐ ఆర్ట్ షోలో ప్రదర్శించడం జరుగుతుందని వివరించారు. దరఖాస్తులను, ఆవిష్కరణలను హెలో ఎట్ సూపర్ చైన్నె .కామ్‌కు పంపించాలని సూచించారు.ఐదు చోట్ల ఈడీ దాడులుసాక్షి, చైన్నె : చైన్నెలో బుధవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు ఐదుచోట్ల సోదాలలో నిమగ్నమయ్యారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో ఎన్పోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తరచూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి సోదాలు నిర్వహిస్తూ రావడం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయాన్నే చైన్నెలో ఐదుప్రాంతాలను ఈడీ అధికారులు ఎంపిక చేసుకున్నారు. అడయార్, వేళచ్చేరి ,వెస్ట్ మాంబళం, మేడవాక్కం తదితర ఐదు చోట్ల పొద్దుపోయే వరకు సోదాలు జరిగాయి. ఈ నివాసాలను ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త బిష్ణోయ్ , ఓ ప్రముఖ వైద్యురాలు ఇందిరకి సంబంధించినవిగా విచారణలో వెలుగు చూశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు నిఘా నీడలో జరుగుతున్నాయి.మురుగు నీటి శుద్ధీకరణకు స్వదేశీ సాంకేతికత– ఐఐటీ మద్రాసు ఆవిష్కరణసాక్షి, చైన్నె: దేశీయంగా తదుపరి తరం మురుగు నీటి శుద్ధీకరణ సాంకేతికతను ఐఐటీ మద్రాసు స్టార్టప్ జేఎస్పీ ఎన్విరో అభివృద్ధి చేసింది. ఈ వివరాలను బుధవారం ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని పరిశ్రమలలో ఈ పరిశోధనను విజయవంతంగా అమలు చేశారు. ఈ సాంకేతికత ప్రయోజనాలను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందిన జెఎస్పీ ఎన్విరో సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రియదర్శిని మణి వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో మురుగునీటిని శుద్ధి చేసే సాంకేతికత ఇది అని పేర్కొన్నారు. స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి డాక్టర్ విటీ ఫిదాల్కుమార్ పేర్కొంటూ, ప్రస్తుత సాంకేతికతలతో ఉన్న ముఖ్యమైన తేడాలను వివరించారు. సాంప్రదాయ ఏరోబిక్ వ్యవస్థలు మురుగు నీటిలోకి ఆక్సిజన్‌ను పంప్ చేయడానికి పెద్ద మొత్తంలో విద్యుత్‌ను వినియోగిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ దేశీయ సాంకేతికత బెడ్స్టీఎం ఆక్సిజన్ లేకుండా పనిచేస్తుందని, ఎలక్ట్రోడ్ భర్తీలు తరచూ అవసరం లేదన్నారు. బీఈఏడీఎస్(బెడ్స్) విద్యుత్, రసాయనాలను ఉపయోగించకుండా మురునీటిని శుభ్ర పరుస్తుందని వివరించారు. ఈరోడ్, పెరుందురైలలోని రెండు పారిశ్రామిక యూనిట్లలో విజయవంతంగా ఈ టెక్నాలజీ అమలు చేశామన్నారు. -
విజయ్ తొలి బహిరంగ సభ.. తమిళ హీరోల పూర్తి మద్దతు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. విల్లుపురం సమీపంలో తన తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ మొదటి మహానాడు సభ నిర్వహించాడు. దీనికి దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా హాజరయ్యారని అంచనా. ఇందులో తన పార్టీ ఆలోచనలు, 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏం చేయబోతున్నామో అనే విషయాల్ని విజయ్ చాలావరకు చెప్పుకొచ్చారు. వన్ కమ్యూనిటీ, వన్ గాడ్ అనే సిద్ధాంతంతో తమ పార్టీ ముందుకు వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)ఇక రాజకీయంగా తొలి సభ పెట్టిన హీరో విజయ్‌కి తమిళ హీరోల నుంచి పూర్తిస్థాయిలో మద్ధతు లభించింది. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి, జయం రవి, దర్శకులు నెల్సన్ దిలీప్ కుమార్, వెంకట్ ప్రభు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటులు శశి కుమార్, వసంత్ రవి, కమెడియన్ సతీశ్, నిర్మాత అర్చన కళపతి.. ఇలా చాలామంది తమిళ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విజయ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)இன்று தனது புதிய பயணத்தை தொடங்கவிருக்கும் விஜய் சாருக்கு எனது மனமார்ந்த வாழ்த்துகள் 🙏❤️ @tvkvijayhq— Sivakarthikeyan (@Siva_Kartikeyan) October 27, 2024தவெக கட்சியின் முதல் மாநில மாநாடு சிறக்க,.தவெக தலைவர் விஜய் சாருக்கும், தொண்டர்களுக்குவாழ்த்துகள் #TVK_maanadu pic.twitter.com/dk9hU9wSDy— VijaySethupathi (@VijaySethuOffl) October 27, 2024Congratulations Thalapathy @actorvijay Anna on this incredible milestone #TVKMaanaadu 👍🏼Bring the same passion and dedication to politics that you’ve shown in cinema. Wishing you a great success on this new journey !!!— Jayam Ravi (@actor_jayamravi) October 27, 2024My hearty wishes to my dear @actorvijay sir for ur new beginning today ❤️💥👍💐— Nelson Dilipkumar (@Nelsondilpkumar) October 27, 2024Best wishes @tvkvijayhq na, as u beginning this inspiring new journey with today’s #Maanaadu !! May your vision bring positive change and light to many na!! 🙏🏽❤️🔥 #TVKMaanaadu pic.twitter.com/6QjxinH5Dx— venkat prabhu (@vp_offl) October 27, 2024Wishing Dearesr Anna ❤️🔥 @actorvijay @tvkvijayhq #TVKFlagAnthem 💥All the Very Best And Super Successfull #TVK_maanadu 💥✨⭐️ pic.twitter.com/tdGVpswl6z— thaman S (@MusicThaman) October 27, 2024உங்கள் வரவு, எளிய மக்களுக்கான பெரிய நம்பிக்கையாக அமையட்டும். 👍நல் வாழ்த்துகள்…விஜய் சார் @actorvijay @tvkvijayhq #TVKMaanaduoct27 #Thalapathy#தமிழகவெற்றிக்கழகம் pic.twitter.com/rAVGa4oj6z— M.Sasikumar (@SasikumarDir) October 27, 2024My heartfelt wishes to @actorvijay sir, for your wonderful start today, You have been truly an inspiration to many of us not only through your films alone, soon will be remembered and appreciated for your political journey too in the coming years…I am sure today will be a…— Vasanth Ravi (@iamvasanthravi) October 27, 2024திரைத்துறையைப் போல் இதிலும் வெற்றிக் கொடி நாட்ட வாழ்த்துக்கள் @tvkvijayhq sir 💪👏❤️ pic.twitter.com/1HdRmQngJV— Sathish (@actorsathish) October 27, 2024Wishing you the very best @tvkvijayhq na for the #TVK_maanadu today 🙌🔥 pic.twitter.com/CZyBS4z2wL— Archana Kalpathi (@archanakalpathi) October 27, 2024#தமிழகவெற்றிக்கழகம் மாற்றத்தை எதிர்பார்த்து வாழ்த்துகிறோம் வெற்றி பெற @actorvijay sir ☺️ pic.twitter.com/nzDH8VYXJZ— சாய் தன்ஷிகா (@SaiDhanshika) October 27, 2024 -
Tamilnadu: ఢిల్లీలో చక్రం తిప్పే తమిళ తంబి ఎవరో..?
డీఎంకే అధ్యక్షుడు, సీఎంగా ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎంగా పళణిస్వామి జాతీయ రాజకీయాల్లో రాణించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకోసం రానున్న లోక్‌సభ ఎన్నికలను ఈ ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీలో పళణి స్వామికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చునే అవకాశం రావడం అన్నాడీఎంకే వర్గాల్లో అమితానందాన్ని నింపింది. ఇక బెంగళూరులో జరిగిన ఐ.ఎన్.డి.ఐ.ఎ భేటీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పక్కనే కూర్చోవడంతో పాటు జాతీయ స్థాయి ప్రతిపక్షాల కూటమిలో స్టాలిన్‌కు సముచిత స్థానం దక్కడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఎవరు చక్రం తిప్పుతారనే చర్చ జోరందుకుంది. సాక్షి, చైన్నె: జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర ఎప్పుడూ కీలకంగానే ఉంటున్నాయి. దివంగత నేతలు కామరాజర్, అన్నాదురై, ఎంజీఆర్ వంటి వారు జాతీయ రాజకీయాలలో రాణించిన వారే. అయితే, జాతీయ రాజకీయాలను శాసించిన ఘనత మాత్రం దివంగత డీఎంకే అధినేత, కలైంజ్ఞర్ కరుణానిధి, మాజీ సీఎం జయలలితలకే దక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అప్పట్లో కుప్ప కూలడంలో జయలలిత కీలక పాత్రే పోషించారు. ఇక, యూపీఏ అధికారంలోకి రావడంతో పాటు, ఆ కేబినెట్లలో అత్యధిక స్థానాలను దక్కించుకుని జాతీయ స్థాయిలో తమిళ ఖ్యాతిని చాటిన నేత మాత్రం కరుణానిధి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలూ జీవించి లేరు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే ముక్కలు కావడం ,నాయకత్వ లోటు నెలకొనడం వంటి పరిణామాలలో ఆ పార్టీని తన గుప్పెట్లోకి తీసుకుని బల నిరూపణలో పళణి స్వామి సఫలీకృతులు అవుతున్నారు. అదే సమయంలో కరుణానిధి మరణంతో డీఎంకే అధ్యక్ష పగ్గాలు చేపట్టి గత లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తాను స్టాలిన్ చాటుకున్నారు. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టిన స్టాలిన్ తాజాగా జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహానాయకులు ప్రస్తుతం జీవించి లేకున్నా, ఆ పార్టీల బలాన్ని అస్త్రంగా చేసుకుని ఢిల్లీ పెద్దలు స్టాలిన్, పన్నీరు సెల్వంకు ఎన్డీఏ, ఇండియా కూటముల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. పళణికి మోదీ అభయం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టమే కాకుండా, తన బలాన్ని చాటే ప్రయత్నాలను విస్తృతం చేశారు. ఈ సమయంలో ఎన్డీఏ కూటమిలోని అన్నాడీఎంకేకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన్యం ఇవ్వడమే కాకుండా, ఢిల్లీలో జరిగిన సమావేశానికి తనను ఆహ్వానించడం పళణి స్వామిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చోవడమే కాకుండా, సమావేశానికి హాజరైన నేతలందరినీ కలిసి తన ఉనికి చాటుకునే విధంగా పళణి జోరు పెంచడం గమనార్హం. ఈ సమావేశం ముగించుకుని బుధవారం చైన్నెకు చేరుకున్న పళణిలో మరింత ఉత్సాహం తొణికిసలాడడం.. ప్రత్యర్థి పన్నీరు సెల్వాన్ని మరింత షాక్‌కు గురి చేసింది. రానున్న ఎన్నికల ద్వారా జాతీయ స్థాయిలో సత్తాచాటాలంటే అత్యధిక ఎంపీ స్థానాల కైవసం చేసుకోవాలని పళణి భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కూటమికి నేతృత్వం వహించి అన్నాడీఎంకేకు పెద్ద దిక్కుగా తన బలాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇక, రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి ఉంటుందని పళణి స్పష్టం చేయడం విశేషం. జాతీయ స్థాయిలో తాము ఎన్డీఏతోనే ఉంటామని, రాష్ట్రానికి వచ్చేసరికి అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అవినీతికి కేరాఫ్ అడ్రస్సుగా మారిన డీఎంకేకు మున్ముందు అన్నీ ఓటములే ఎదురుకానున్నాయంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. తిరుగులేని స్టాలిన్.. స్టాలిన్‌కు జాతీయస్థాయి నేతలతో ఎప్పటి నుంచో పరిచయాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కరుణానిధి ప్రతినిధిగా అప్పట్లో ఆయన అనేక పార్టీల నేతలను కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం జాతీయ రాజకీయాలలో రాణించే ప్రయత్నాలకు కలిసి వస్తోంది. దేశంలో కాంగ్రెస్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పార్టీ డీఎంకే. ఇది వరకు కాంగ్రెస్ కూటమిలో కీలకంగా ఉన్న డీఎంకే, ప్రస్తుతం రెండు రోజుల సమావేశానంతరం బెంగళూరు వేదికగా కొత్తగా ఆవిర్భవించిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఐఎన్డీఐఏ–ఇండియా)లోనూ అదే ఊపును కొనసాగించే వ్యూహాలకు పదును పెట్టింది. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పక్కనే కూర్చోవడమే కాకుండా, సోనియా, మమత, నితీష్‌కుమార్ , శరద్ పవార్, కేజ్రీవాల్ వంటి నేతలతో స్టాలిన్ కలిసి పోవడం గమనార్హం. తన ప్రసంగంలోనూ జాతీయ స్థాయి అంశాలను పదే పదేస్టాలిన్ ప్రస్తావించడాన్ని బట్టి మున్ముందు ఢిల్లీలో తన తండ్రి, దివంగత నేత కరుణానిధి తరహాలో చక్రం తిప్పేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఆయన ఏ మేరకు సఫలీకృతులు అవు తారో 2024 వరకు వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరితో పాటుగా తమిళనాడులోని 40 స్థానాలను కై వశం చేసుకుని జాతీయ స్థాయిలో తన బలాన్ని చాటేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న అన్నా డీఎంకే, బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ సమావేశంలో పళణి స్వామిని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇకపై వారికి అవినీతి గురించి మాట్లాడే అర్హత ఉందా..? ఇదే హాస్యాస్పదం అని స్టాలిన్ చమత్కరించడం గమనార్హం. -
‘తమిళనాడు అసెంబ్లీని రద్దు చేయాలి’
చెన్నై: అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీని రద్దు చేసి, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకుడు కార్తి చిదంబరం డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో జయలలితకు తమిళనాడు ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. ఆమె చనిపోవడంతో రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు శాసనసభను వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంతో పోలిస్తే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయని కార్తి తండ్రి, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అంతకుముందు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత శశికళకు లేదని పరోక్షంగా పేర్కొన్నారు. -
‘శశికళ సీఎం అవుతారని అనుకోను’
చెన్నై: జయలలితకు శశికళ నటరాజన్ నిజమైన వారసురాలు కాదని సినీ నటి గౌతమి అన్నారు. ‘చిన్నమ్మ’ ముఖ్యమంత్రి అవుతుందని తాను అనుకోవడం లేదని ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. తమిళనాడు రాజకీయాలను చూస్తే బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు. జయలలితకు నిజమైన వారసుడు పన్నీర్ సెల్వం అని పేర్కొన్నారు. తన వారసులు ఆయననే అని ‘అమ్మ’ చాలాసార్లు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్కసారి కూడా ఆయనను ‘అమ్మ’ దూరం పెట్టలేదన్నారు. పన్నీర్ సెల్వం ఎంతో విధేయతగా ఉన్నారని, ఆయనను కాదని సీఎం పదవిని వేరొకరికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. శశికళ చాలా విషయాలు బయటకు తెలియనివ్వలేదని ఆరోపించారు. పన్నీర్ సెల్వం మంచి పాలన అందించగలరన్న నమ్మకాన్ని గౌతమి వ్యక్తం చేశారు.