
కూలీ సినిమా కోసం విలన్ రోల్ చేజార్చుకున్నానంటున్నాడు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే కూలీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది.
విలన్‌గా ఛాన్స్ వస్తే..
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు లోకేశ్. ఈ సందర్భంగా ఓ చిట్‌చాట్‌లో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి సినిమాలో విలన్‌గా ఛాన్స్ వచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. దర్శకురాలు సుధా కొంగరతో పలుమార్లు సమావేశమయ్యానని తెలిపాడు. కానీ కూలీ చిత్రీకరిస్తున్న సమయంలోనే పరాశక్తి కూడా సెట్స్‌పైకి వెళ్లిందన్నాడు.
రిజెక్ట్ చేశా
విలన్‌గా నటించాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ డేట్స్ క్లాష్ అవుతున్నందున పరాశక్తి మూవీ ఆఫర్‌ను తిరస్కరించానని పేర్కొన్నాడు. శివకార్తికేయన్ సైతం జోక్యం చేసుకుని తనను విలన్‌గా చేయమని సూచించారన్నాడు. కానీ కూలీ సినిమాను చెప్పిన సమయానికి పూర్తి చేయాల్సి ఉన్నందున దాన్ని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు.
త్వరలోనే హీరోగా..
పరాశక్తి సినిమా విషయానికి వస్తే.. శివకార్తికేయన్, రవిమోహన్, శ్రీలీల, అధర్వ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. ఇకపోతే లోకేశ్.. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ సినిమాలో కథానాయకుడిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
చదవండి: భార్యకు వండి పెడ్తా.. పిల్లల కోసమే ఆ పద్ధతి మార్చుకున్నా: తారక్