Tollywood Movies: డిసెంబర్‌ మూడో వారంలో రిలీజవుతున్న చిత్రాలివే!

List Of Upcoming Telugu Movies OTT And Theatre In December 3rd Week - Sakshi

కరోనా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీ సినిమా రిలీజ్‌ల మీద దృష్టిపెట్టింది. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌ వరకు కదిలి వస్తారని అఖండ సినిమా నిరూపించడంతో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ బరిలో దూకుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం పెద్దపెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం..

స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌
అందరికీ ఎంతో ఇష్టమైన కార్టూన్‌ స్పైడర్‌ మ్యాన్‌. ఈ కార్టూన్‌ సాహసాలు చేస్తూ అలరించేందుకు రెడీ అయ్యాడు. జాన్‌ వాట్స్‌ దర్శకత్వం వహించిన హాలీవుడ్‌ మూవీ స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌లో టామ్‌ హోలాండ్‌, బెనిడిక్ట్‌ కంబర్‌బ్యాచ్‌, జాకబ్‌ బ్యాట్‌లాన్‌, జందాయా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. భూమిని నాశనం చేయడానికి వచ్చిన శత్రువులను స్పైడర్‌ మ్యాన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే! ఈ చిత్రం ఈ నెల 16న రిలీజ్‌ అవుతోంది.

పుష్ప
ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం పుష్ప: ది రైజ్‌ డిసెంబర్‌ 17న రిలీజ్‌ అవుతోంది. అనసూయ, సునీల్‌, ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్యపాత్రలు పోషించారు. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత ఊ అంటావా మావా.. అనే ఐటం సాంగ్‌లో ఆడిపాడింది. ఈ పాన్‌ ఇండియా మూవీ ఐదు భాషల్లో విడుదలవుతోంది.

అనుభవించు రాజా
యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ హీరోగా కశిష్‌ ఖాన్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ నవంబర్‌ 26న థియేటర్‌లో రిలీజైంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో డిసెంబర్‌ 17 నుంచి అందుబాటులోకి రానుంది.

జీ5

♦ 420 ఐపీసీ(హిందీ) - డిసెంబరు 17

నెట్‌ఫ్లిక్స్‌

♦ ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ (హాలీవుడ్‌) - డిసెంబరు 17

♦ ది విచ్చర్‌ వెబ్‌ సిరీస్‌ - డిసెంబరు 17

♦ కడశీల బిర్యాని తమిళ్‌ - డిసెంబరు 17

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top