సుమన్‌ చేతుల మీదుగా ఝాన్సీ ఐపీఎస్‌ ట్రైలర్‌ రిలీజ్‌ | Laxmi Rai Jhansi IPS Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Laxmi Rai: కన్నడ హిట్‌ మూవీ తెలుగులో.. సుమన్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ రిలీజ్‌

Oct 21 2024 6:22 PM | Updated on Oct 21 2024 6:46 PM

Laxmi Rai Jhansi IPS Movie Trailer Released

లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఝాన్సీ ఐపీఎస్. గురుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళ, కన్నడ భాషల్లో విడుదలై ఘన విజయాన్ని  సాధించింది. సోమవారం నాడు ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను హీరో సుమన్‌ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రం తెలుగు హక్కులు ఆర్ కె ఫిలిమ్స్ అధినేత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు.

లక్మీ రాయ్ కెరీర్‌లో హైలైట్‌
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. లక్ష్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్ కెరీర్‌లో మైలు రాయిగా నిలిచిపోతాయి.

నట విశ్వ రూపం
విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసే డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్‌గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్మీ రాయ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  నవంబర్ రెండో వారంలో విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు.

థియేటర్స్ దొరకాలి
హీరో సుమన్ మాట్లాడుతూ.. లక్మీ రాయ్  ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఫైట్స్ ఆదరగొట్టారు. ఇలాంటి చిత్రాలకు మంచి థియేటర్స్ దొరకాలి. తెలుగులో కూడా ఈ మూవీ ఘన విజయం సాధించాలి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement