నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిక | Lawrence Bishnoi Target Other Bollywood Actor And His Wife After Salman Khan, Know More Details Inside | Sakshi
Sakshi News home page

నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిక

Apr 21 2025 8:00 AM | Updated on Apr 21 2025 8:43 AM

Lawrence Bishnoi Target Other Bollywood Actor And His Wife

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌(Lawrence Bishnoi) నుంచి బాలీవుడ్‌కు చెందిన మరో హీరోకు హత్య బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు జరిపినట్లే నటుడు అభినవ్ శుక్లా( Abhinav Shukla)ఇంటిపై కూడా దాడులు జరుపుతామంటూ బెదిరింపులకు దిగారు. త్వరలో చంపేస్తామంటూ ఒక హెచ్చరికతో మెసేజ్‌ పంపారు. అయితే, ఈ మెసేజ్‌ను సోషల్‌మీడియా యూజర్‌ పంపినట్లు తెలుస్తోంది. తాను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కోసం పనిచేస్తున్నాని ఈ హెచ్చరికలు వారికి జారీ చేశాడు.

కారణం ఇదే..
నటుడు అభినవ్ శుక్లా సతీమణి రుబీనా వల్లే ఈ వార్నింగ్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ టీవీలో ప్రసారం అయ్యే  'బాటిల్‌గ్రౌండ్' షోలో ఆమె పాల్గొంది. అయితే, ఆ షో కొనసాగుతున్న మధ్యలో రాపర్ ఆసిమ్ రియాజ్‌తో ఆమెకు గొడవ అయింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపుల మెసేజ్‌ వచ్చింది. ఎపిసోడ్ ప్రసారం అయిన వెంటనే.. ఆమెతో పాటు అభినవ్‌ను ఆన్‌లైన్‌లో లక్ష్యంగా చేసుకుని భారీగా వార్నింగ్స్‌ వచ్చాయి. వారికి వచ్చిన మెసేజ్‌లను శుక్లా తన సోషల్‌మీడియా హ్యాండిల్‌లో వరుస స్క్రీన్‌షాట్‌లు, వీడియోలను పంచుకున్నారు, అందులో అంకుష్ గుప్తా అనే వ్యక్తి ఈ బెదిరింపు మెసేజ్‌ పంపినట్లు కనిపిస్తోంది.

అభినవ్‌ శుక్లా దంపతులకు పంపిన ఆ మెసేజ్‌ ఇలా ఉంది. 'నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వచ్చాను. మీ చిరునామా నాకు తెలుసు. నేను రావాలా..? సల్మాన్ ఖాన్‌పై కాల్పులు జరిపినట్లే, నేను మీ ఇంటికి వచ్చి AK-47తో మిమ్మల్ని కాల్చివేస్తాను. ఇది మీ చివరి హెచ్చరికగా భావించండి. ఆసిమ్‌కు వెంటనే క్షమాపణలు చెప్పండి. అలా జరగలేదంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. లారెన్స్ బిష్ణోయ్ ఆసిమ్‌కు అండగా నిలుస్తాడు. ఆసిమ్‌ మా గ్యాంగ్‌ మనిషి' అని ఉంది. వార్నింగ్‌ ఇచ్చిన వ్యక్తిది చండీగఢ్‌లా ఉందని అభినవ్ తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement