‘బిగ్‌బాస్‌’ ఫేం దివి హీరోయిన్‌గా ‘లంబసింగి’, రిలీజ్‌ ఎప్పుడంటే? | Lambasingi Movie Release Date Out | Sakshi
Sakshi News home page

‘బిగ్‌బాస్‌’ ఫేం దివి హీరోయిన్‌గా ‘లంబసింగి’, రిలీజ్‌ ఎప్పుడంటే?

Mar 7 2024 4:51 PM | Updated on Mar 7 2024 5:03 PM

Lambasingi Movie Release Date Out - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం దివి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘లంబసింగి’.‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో డైరెక్టర్‌ కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ మూవీ ద్వారా భరత్‌ రాజ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. 

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుండి వయ్యారి గోదారి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. డిఫరెంట్ మెలోడీ గా సాగే ఈ సోంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా లంబసింగి సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement