ఆదిపురుష్: తగ్గేది లేదంటున్న బాలీవుడ్‌ భామ | Kriti Sanon Hired A Telugu Tutor For Adipurush Movie | Sakshi
Sakshi News home page

ఆదిపురుష్ కోసం తెలుగు నేర్చుకుంటున్న బాలీవుడ్‌ భామ

Mar 25 2021 12:18 PM | Updated on Mar 25 2021 12:53 PM

Kriti Sanon Hired A Telugu Tutor For Adipurush Movie - Sakshi

కృతిసనన్‌ ఆదిపురుష్‌లో తన క్యారెక్టర్‌ పరంగా ఎందులోనూ రాజీపడకుండా ది బెస్ట్‌ ఫెర్మామెన్స్‌ ఇవ్వాలనుకుంటోందట.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా కనిపించనున్నారు. భారీ తారాగణంతో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్‌గా ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు.

ఓవైపు గ్రాఫిక్స్‌కు సంబంధించిన పనులు చేస్తూనే మరోవైపు నటీనటులతో షూటింగ్ చేస్తున్నారు. ఇంతటి భారీ ప్రాజెక్ట్‌లో భాగమైన కృతి కూడా పాత్ర పరంగా ఎందులోనూ రాజీపడకుండా ది బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వాలనుకుంటోంది. పేరుకు పాన్‌ ఇండియా సినిమా అయినా తెలుగు మూలం కావడంతో ఏదో నామమాత్రంగా పాత్ర కోసం తెలుగులో సన్నద్దం కావాలి అని కాకుండా ఏకంగా తెలుగు నేర్చుకోవడానికి  నిర్ణయించుకుందట. అందుకోసం ఓ తెలుగు ట్యూటర్‌ను కూడా నియమించుకున్నట్లు సమాచారం. మరి ఈ భామ

కృతి సనన్‌ కెరీర్‌ విషయానికొస్తే.. మహేశ్‌బాబు 'నేనొక్కడినే' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తరువాత నాగ చైతన్యతో 'దోచేయ్' కూడా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయే సరికి ఈ అమ్మడు తిరిగి బాలీవుడ్‌కు మకాం మార్చింది . అక్కడ కృతీ సనన్‌ నటించిన సినిమాలు హిట్‌ అవ్వడంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

( చదవండి : ఆదిపురుష్‌కి స్వాగతం )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement