Krithi Shetty Reaction On Samantha Oo Antava Mava Song In Pushpa, Deets Inside - Sakshi
Sakshi News home page

Krithi Shetty: సమంత ఊ అంటావా పాటపై కృతీ రియాక్షన్‌.. అలాంటి పాటలు చేయనంటూ..

May 13 2023 11:02 AM | Updated on May 13 2023 11:18 AM

Krithi Shetty Reaction on Samantha Oo Antava Mava Song - Sakshi

ఊ అంటావా మావ వంటి ప్రత్యేక గీతాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని విలేకరి సూటిగా ప్రశ్నించాడు. దీనికి కృతీ చేయనని కుండ బద్ధలు కొట్టేసింది.

పాన్‌ ఇండియా సినిమాగా రిలీజైన పుష్పలోని 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' పాట ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే! దక్షిణాది నుంచి ఉత్తరాది దాకా అందరూ ఈ పాట మత్తులో ఊగిపోయారు, తనివితీరా స్టెప్పులేశారు. మొదట ఈ పాట చేయడానికి సమంత ఒప్పుకోకపోయినప్పటికీ అల్లు అర్జున్‌ నచ్చజెప్పి ఆమెతో ఓకే చెప్పించాడు. బన్నీ ఊహించినట్లుగానే ఈ పాటతో సామ్‌కు నేషనల్‌ లెవల్‌లో మరింత గుర్తింపు వచ్చింది.

అయితే ఇలాంటి పాటలు తాను అస్సలు చేయనని అంటోంది యంగ్‌ హీరోయిన్‌ కృతీ శెట్టి. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం కస్టడీ. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతీకి ఓ ప్రశ్న ఎదురైంది. ఊ అంటావా మావ వంటి ప్రత్యేక గీతాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని విలేకరి సూటిగా ప్రశ్నించాడు. దీనికి కృతీ చేయనని కుండ బద్ధలు కొట్టేసింది.

ఆమె మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికైతే అలాంటి ఐటం సాంగ్స్‌లో నటించాలనుకోవడం లేదు. ఎందుకంటే నాకు ఆ పాటలపై ఎలాంటి అవగాహన లేదు. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కూడా! నా సినీ ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయమేమిటంటే.. సౌకర్యంగా అనిపించనప్పుడు చేయకపోవడమే మంచిది. శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలోని కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌లో కూడా మనస్ఫూర్తిగా నటించలేకపోయాను. మనసుకు నచ్చనప్పుడు అలాంటివి చేయకుండా ఉండటమే బెటర్‌ అని అప్పుడే తెలుసుకున్నా. మున్ముందు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగుతా. ఊ అంటావా పాట విషయానికి వస్తే.. సమంత ఒక ఫైర్‌.. ఆమె చాలా బాగా డ్యాన్స్‌ చేశారు' అని చెప్పుకొచ్చింది బేబమ్మ.

చదవండి: షూటింగ్‌లో వీజే సన్నీకి గాయాలు, ఆస్పత్రికి తరలింపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement