ఆ నటుడికి రుణపడి ఉన్న కృష్ణవంశీ.. ఏం చేశాడంటే? | Krishna Vamsi Indebted To This Actor | Sakshi
Sakshi News home page

5 రోజులుగా అన్నం తినని దర్శకుడు.. తిండి పెట్టిన నటుడు

Nov 29 2025 12:17 PM | Updated on Nov 29 2025 12:25 PM

Krishna Vamsi Indebted To This Actor

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ కెరీర్‌ తొలినాళ్లలో రామ్‌గోపాల్‌ వర్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. గులాబీ సినిమాతో దర్శకుడిగా మారాడు. అంతేకాదు తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నాడు. రెండో సినిమా నిన్నేపెళ్లాడతా, మూడో మూవీ సింధూరం చిత్రాలకు ఏకంగా జాతీయ అవార్డులు గెల్చుకోవడం విశేషం. ఈయన చివరగా రంగమార్తాండ సినిమా తెరకెక్కించాడు.

కెరీర్‌ తొలినాళ్లలో ఇబ్బందులు
అయితే కృష్ణవంశీ కెరీర్‌ తొలినాళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కడుపు నిండా తిండి తినలేని స్థితిలో ఉన్నాడు. ఒక్కోసారి నాలుగైదు రోజుల వరకు ఆకలి కేకలతో అలమటించేవాడట! అంత ఆకలిగా ఉన్నా సరే.. ఎవరైనా పిలిస్తే వెళ్లేవాడు కాదట. కారణం.. ఎవరికీ రుణపడి ఉండటం ఆయనకు ఇష్టముండదు.

తిండి లేక అలమటించాడు
ఓసారి కృష్ణవంశీ (Director Krishna Vamsi) ఐదు రోజులుగా తిండి లేక అలమటించాడు. అప్పుడు బ్రహ్మాజీ తిందాం రమ్మని పిలిచాడు. ఆ రోజు ఒంట్లో ఓపిక లేక కాదనలేకపోయాడట! అతడితో కలిసి వెళ్లి భోజనం చేశాడు. అయితే అతడికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని అప్పటినుంచి మథనపడటం మొదలుపెట్టాడు.

కృతజ్ఞతతో..
అలా సింధూరం సినిమా రాసుకున్నప్పుడు బ్రహ్మాజీ (Brahmaji) హీరోగా ఎందుకు చేయకూడదు? అని ఆలోచించాడు. స్టార్స్‌తో తీస్తే డబ్బులు వస్తాయి. కానీ, బ్రహ్మాజీతో తీస్తే సంతృప్తి లభిస్తుందని ఆలోచించాడు. బ్రహ్మాజీ అన్నం పెట్టాడనే కృతజ్ఞతతో అతడిని హీరోగా పెట్టి సింధూరం తీశాడు. అది పెద్దగా ఆడకపోయినా తర్వాతి సినిమాల్లో మంచి క్యారెక్టర్‌ ఇచ్చాడు. అలా ఒక్కపూట అన్నం పెట్టినందుకు బ్రహ్మాజీ కృతజ్ఞత తీర్చుకున్నాడు కృష్ణవంశీ.

చదవండి: చీప్‌ పాత్రలు చేయను: రాశీఖన్నా

Advertisement
 
Advertisement
Advertisement