
కృష్ణసాయి హీరోగా పీఎస్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డేంజర్’. పూజిత, మేకా రామకృష్ణ, రమేశ్ గుత్తుల, వెంకటేశ్వరరావు, నితీష్ ఇతర పాత్రధారులు. కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శంభు ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఓ యువతా... నీ గమ్యం ఎటు వైపు?’ అంటూ సాగే పాటను విడుదల చేశారు.
ఈ పాటకి డైరెక్టర్ పీఎస్ నారాయణ సాహిత్యం అందించగా, రమణ సీలం ΄ాడారు. ‘‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగారి పిలుపు మేరకు మా బాధ్యతగా డ్రగ్స్ వాడొద్దంటూ యువతలో చైతన్యం కలిగించేలా మా ‘డేంజర్’ సినిమాలో ‘ఓ యువతా... నీ గమ్యం ఎటు వైపు?’ ΄ాటని చిత్రీకరించాం’’ అన్నారు కృష్ణసాయి.