ఉత్తరాంధ్రను  ఊపేసేలా... శ్రీకాకుళం చిందేసేలా కోట బొమ్మాళి పాట

Kotabommali PS Movie Title Song Lyrical Song Released - Sakshi

శ్రీకాంత్‌ మేక, రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తేజా మార్ని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 24న విడుదలవుతోంది. ఈ సినిమా నుంచి ‘ఉత్తరాంధ్రను  ఊపేసేలా... శ్రీకాకుళం చిందేసేలా...’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ని తాజాగా రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

శ్రీకాకుళం జిల్లాలోని కోట బొమ్మాళి గ్రామంలోని కోటమ్మ తల్లి సన్నిధానంలో ఈ పాటను విడుదల చేశారు. రంజన్‌  రాజ్‌ సంగీతం అందించిన ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలలో రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్, తేజా మార్ని, చిత్రసహ నిర్మాత భాను ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top