Koffee With Karan Show: ఎట్టకేలకు కియారాతో డేటింగ్‌పై నోరు విప్పిన సిద్ధార్థ్‌, ఏమన్నాడంటే..

Koffee With Karan: Sidharth Malhotra, Kiara Advani Confirm Their Relationship - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌ ప్రేమజంటలో కియారా అద్వానీ-సిద్ధార్థ్‌ మల్హోత్రాల ప్రేమయాణం తరచూ హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఈ జంట నేరుగా ఎప్పుడు స్పందించలేదు. ఒకవేళ మాట్లాడిన తాము స్నేహితులమే అంటూ రూమార్లకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా వీరి ప్రేమ, పెళ్లిపై రూమర్లు ఆగడం లేదు. ఇటీవల కియార బర్త్‌డే వేడుకలో భాగంగా ఈ జంట దుబాయ్‌లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు బయటకు రావడంతో వీరి లవ్‌ ఎఫైర్‌ వార్తలు మరోసారి గుప్పుమన్నాయి.

చదవండి: చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై హీరో రియాక్షన్‌

ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఓ షోలో తమ రిలేషన్‌పై నోరువిప్పాడు సిద్ధార్థ్‌. కాఫీ విత్‌ కరణ్‌ షోకు వచ్చిన సిద్ధార్థ్‌, కియారాతో ప్రేమలో ఉన్నట్లు పరోక్షంగా ప్రకటించాడు. హీరో విక్కీ కౌశల్‌తో కలిసి సిద్ధార్థ్‌ ఈ టాక్‌ షోలో పాల్గొని సందడి చేశాడు. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ చేత కియారాతో రిలేషన్‌ను బయటపెట్టించే ప్రయత్నం చేశాడు కరణ్‌. ఈ క్రమంలో కెరీర్‌ ప్లాన్‌ ఏంటని సిద్ధార్థ్‌ను ప్రశ్నించాడు.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్‌. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్‌ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్‌. 

చదవండి: ఆస్కార్‌ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ

ఈ సందర్భంగా కాఫీ విత్‌ కరణ్‌ గత సీజన్‌లో కియారాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సిద్ధార్థ్‌ కోసం ప్లే చేశాడు కరణ్‌. అందులో సిద్ధార్థ్ గురించి అడగ్గా.. తామిద్దరం స్నేహితుల కంటే ఎక్కువ అని కియారా చెప్పడం.. సిద్ధార్థ్‌ ముసిముసి నవ్వడంతో వీరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్‌ అయిపోతున్నారు. అంతేకాదు తన ప్రశ్నలతో కరణ్‌, కియారాను ఇబ్బంది పెట్టడం చూసి తనని ఎందుకు అన్ని ప్రశ్నలు అడిగారు? అని అన్నాడు. దీంతో ఒకే మీ పెళ్లేప్పుడు అని సిద్ధార్థ్‌ను అడగ్గా.. మీరు సెటిల్‌ అయ్యారు.. మేము అవ్వోద్దా? అని సమాధానం ఇచ్చాడు. ఇక చివకరగా ఒకవేళ తనని పిలవకుండానే పెళ్లి చేసుకుంటే కొడతానంటూ సిద్ధార్థ్‌ను హెచ్చరించాడు కరణ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top