‘విక్రమ్‌’ కోసం రిస్క్‌ తీసుకుంటున్న కమల్‌ హాసన్‌

KGF stunt directors Anbu-Arivu onboard Kamal Haasan Vikram - Sakshi

ఆరు పదుల వయసులో అదిరిపోయే ఫైట్స్‌ చేయడానికి కమల్‌హాసన్‌ రెడీ అవుతున్నారు. అది కూడా సాదాసీదా ఫైట్స్‌ కాదు. రిస్కీ ఫైట్స్‌ చేయనున్నారు. ‘కేజీఎఫ్‌’ చిత్రానికి అద్భుతమైన ఫైట్స్‌ అందించి, ప్యాన్‌ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఫైట్‌ మాస్టర్స్‌ అన్బు-అరివు జంట లోకనాయకుడు కమల్‌తో ఫైట్స్‌ చేయించనుంది. కమల్‌హాసన్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ తెరకెక్కించనున్న తాజా చిత్రం ‘విక్రమ్‌’.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి అన్బు-అరివుని యాక్షన్‌ కొరియోగ్రఫీకి తీసుకున్నట్లు లోకేష్‌ కనకరాజ్‌ తెలిపారు. ‘‘కమల్‌హాసన్‌ వంటి లెజెండ్‌తో పని చేయడానికి ఎగై్జటింగ్‌గా ఉన్నాం. ‘విక్రమ్‌’ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని అన్బు-రివ్‌ పేర్కొన్నారు. కాగా ‘కేజీఎఫ్‌’కి ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రఫీకి జాతీయ అవార్డు సాధించిన అన్బు-అరివు ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్‌’, రవితేజతో ‘ఖిలాడి’, సూర్య 40వ చిత్రాలకు స్టంట్‌ మాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top