KGF Chapter 2 Trailer Breaks RRR and Radhe Shyam Records - Sakshi
Sakshi News home page

KGF 2 Trailer: రికార్డులు బద్దలు కొట్టిన కెజిఎఫ్‌2.. ఒక్క రోజులోనే 109M వ్యూస్‌

Mar 30 2022 5:30 PM | Updated on Mar 30 2022 9:32 PM

KGF Chapter2 Trailer Breaks RRR And Radhe Shyam Records - Sakshi

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా నటిస్తున్న కెజిఎఫ్‌2 ట్రైలర్‌ రికార్డులు సృష్టిస్తుంది. దేశంలోనే విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌ పొందిన ట్రైలర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కెజిఎఫ్‌ సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

 ఇక రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఒక్కరోజులోనే ఈ ట్రైలర్‌ అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తుంది.కేవలం 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్‌ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్‌ వ్యూస్‌, తెలుగులో 20M,హిందీలో 51M, తమిళంలో 12M, మలయాళంలో 8మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి.

24గంటల్లోనే అత్యధిక వ్యూస్‌ పొందిన ట్రైలర్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌కు 51.12M,రాధేశ్యామ్‌కు57.5M రాగా ఇప్పుడు ఆ రికార్డులను కెజిఎఫ్‌ కొల్లగొట్టింది. మరి ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఇంకెన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందన్నది తెలియాలంటూ ఏప్రిల్‌ 14వరకు వేచి చూడాల్సిందే. 

Advertisement
 
Advertisement
Advertisement