ఆ డ్రామాలు నాకు నచ్చవు: కేతికా శర్మ | Kethika Sharma about Single Movie | Sakshi
Sakshi News home page

ఆ డ్రామాలు నాకు నచ్చవు: కేతికా శర్మ

May 7 2025 12:02 AM | Updated on May 7 2025 12:02 AM

Kethika Sharma about Single Movie

‘‘కెరీర్‌ పరంగా హ్యాపీగా ఉన్నాను. హిట్, ఫ్లాప్స్‌ మన చేతిలో ఉండవు. ఓ నటిగా పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంటుంది. ఇండస్ట్రీలో కొనసాగడం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు కేతికా శర్మ. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘సింగిల్‌’. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ మాట్లాడుతూ– ‘‘సింగిల్‌’ సినిమాలో ఆడీ కంపెనీలో పని చేసే పూర్వ అనే అమ్మాయిపాత్ర చేశాను.

పూర్వ స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఈ మూవీలోని లవ్‌స్టోరీ వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. అల్లు అరవింద్‌గారి సమర్పణలో గీతా ఆర్ట్స్‌లో ఓ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా ఇంట్రవెల్‌ సీక్వెన్స్‌ చాలా సవాల్‌గా అనిపించింది. ఇక ‘రాబిన్‌ హుడ్‌’ సినిమాలో నేను చేసిన ‘అదిదా సర్‌ప్రైజ్‌’లాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఈ మూవీలో లేవు.

సెట్స్‌లో దర్శకులు ఏదీ చెబితే అది చేస్తాను. అలా ‘అదిదా సర్‌ప్రైజ్‌’ సాంగ్‌ చేశాను. ఈ సాంగ్‌లోని కొన్ని డ్యాన్స్‌ మూమెంట్స్‌పై భిన్నా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్‌లో అలాంటి మూమెంట్స్‌పై జాగ్రత్తలు తీసుకుంటా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. మీరు లైఫ్‌లో సింగిల్‌గా ఉన్నారా? అన్న ప్రశ్నకు... ‘‘ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నాను. రిలేషన్‌షిప్‌ అంటూ లేనిపోని డ్రామాలు నాకు నచ్చవు. నిజాయితీగా ఉండాలి. రైట్‌ పర్సన్‌ దొరికితే... ప్రేమిస్తాను’’ అని చె΄్పారు కేతికా శర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement