'కూరగాయలు అమ్మేదాన్ని ఎలా చేశావ్ బ్రో'.. ఆసక్తిగా ట్రైలర్! | Kerintha Fame Parvateesam Movie Trailer Out Today | Sakshi
Sakshi News home page

Market Mahalakshmi Trailer: వరుస ఫ్లాప్‌లతో డిప్రెషన్‌లోకి వెళ్లా: కేరింత హీరో

Mar 11 2024 9:28 PM | Updated on Mar 11 2024 9:35 PM

Kerintha Fame Parvateesam Movie Trailer Out Today - Sakshi

కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తోన్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వీఎస్ ముఖేష్  దర్శకత్వంలో అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బీ2పీ స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

హీరో పార్వతీశం మాట్లాడుతూ.. 'ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. కేరింత తర్వాత మంచి హిట్‌ కొట్టలేకపోయాను. వరుస ఫ్లాప్‌లతో చాలా డిప్రెషన్‌లో ఉన్నా. అప్పుడే మనోడు ముఖేష్‌ నాకు కథ చెప్పాడు. మొదట్లో దర్శకుడిపై నమ్మకం లేదు. కానీ 4-5 రోజుల షూటింగ్ తర్వాత అతనిపై నాకు నమ్మకం ఏర్పడింది. కేరింత చిత్రానికి ఎంత మంచి పేరు వచ్చిందో అదే విధంగా మార్కెట్ మహాలక్ష్మికి కూడా వస్తుందని నమ్ముతున్నా.' అని అన్నారు.

హీరోయిన్ ప్రణీకాన్విక మాట్లాడుతూ..'తెలుగులో ఇది నా మొదటి సినిమా. సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్‌ని చూస్తున్నా. మంచి టాలెంట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. మార్కెట్ మహాలక్ష్మిలో నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది' అని అన్నారు. ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. "మార్కెట్ మహాలక్ష్మిలో నేను రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. పార్వతీశం, ప్రణీకాన్వికతో నా కాంబినేషన్ సీన్స్ నవ్విస్తాయి. దర్శకుడు నా క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేశారు. మార్కెట్ మహాలక్ష్మిని థియేటర్లలో చూసి మా టీమ్‌కి సపోర్ట్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకి థాంక్స్" చెప్పారు.

డైరెక్టర్ వీఎస్ ముఖేష్' మాట్లాడుతూ.. ‘నేను కథ రాసుకున్నప్పుడు టైటిల్ వెంటనే తట్టింది మార్కెట్ మహాలక్ష్మి. అప్పుడే ఫిక్స్ అయ్యా. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి హీరోలు, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు అయితే బాగుంటుంది. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా తీసుకోలేకపోయామని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జో ఎన్మవ్  సంగీతమందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement