
'ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటీ ? ఎవరైనా మన మీద రాయి విసిరితే.. తిరిగి మనమూ విసరాలి. మనమీద ఉమ్మేస్తే.. మనమూ ఉమ్మేయ్యాలి. మనల్ని కొడితే మనమూ కొట్టాలి' అని ఆవేశంగా అంటోంది కీర్తి సురేష్. 'మహానటి' కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తుంది.
Keerthy Suresh Selva Raghavan Chinni Movie Release Date: 'ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటీ ? ఎవరైనా మన మీద రాయి విసిరితే.. తిరిగి మనమూ విసరాలి. మనమీద ఉమ్మేస్తే.. మనమూ ఉమ్మేయ్యాలి. మనల్ని కొడితే మనమూ కొట్టాలి' అని ఆవేశంగా అంటోంది కీర్తి సురేష్. 'మహానటి' కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తుంది. 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు ఏ మూవీ అంతగా సక్సెస్‌ను ఇవ్వలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది కీర్తి సురేష్. 'సర్కారు వారి పాట' చిత్రం మే 12న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందే కీర్తి సురేష్ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఆ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడదల కానుంది. కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సాని కాయిదమ్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'చిన్ని' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6న 'చిన్ని' మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శుక్రవారం (ఏప్రిల్ 22) విడుదల చేశారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తోపాటు ధనుష్ అన్న, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పగ, ప్రతీకారం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. టీజర్‌లో కీర్తి సురేష్ ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.
చదవండి: ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది: కీర్తి సురేష్