Gandhari Song Launch Event: Actress Keerthy Suresh Speech Highlights - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది

Published Tue, Feb 22 2022 8:14 AM

Keerthy Suresh Speech At Gandhari Song Launch Event - Sakshi

Keerthy Suresh Speech At Gandhari Song Launch Event: హీరోయిన్‌ కీర్తీ సురేష్‌ నటించిన తొలి మ్యూజికల్‌ వీడియో ‘గాంధారి’ విడుదలైంది. సోనీ మ్యూజిక్, ది రూట్‌ అసోసియేషన్‌లో రూపొందిన పాట ఇది. పవన్‌ సీహెచ్‌ స్వరపరచిన ఈ  పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించగా, అనన్య భట్‌ పాడారు. బృందా మాస్టర్‌ దర్శకత్వం వహించి, కొరియోగ్రఫీ చేశారు ‘గాంధారి.. గాంధారి.. నీ మరిది.. గాంధారి.. దొంగ చందమామలా ఒంగి చూసిండే’ అంటూ ఈ పాట సాగుతుంది.

ఈ పాట ఆవిష్కరణ సందర్భంగా కీర్తీ సురేష్‌ మాట్లాడుతూ – ‘‘గాంధారి’లాంటి మ్యూజిక్‌ వీడియో చేయడం ఓ ప్రయోగంలా అనిపించింది. రెండు రోజుల్లోనే ఈ పాటను పూర్తి చేశాం. బృందా మాస్టర్‌గారు కొరియోగ్రఫీ చేసిన పాటలు చేశాను. ఇప్పుడు ఆమె దర్శకత్వంలోనూ వర్క్‌ చేయడం సంతోషంగా ఉంది.

‘సారంగ దరియా’ పాట తర్వాత ఈ ‘గాంధారి’ సాంగ్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పవన్‌ సి.హెచ్‌ మరో హిట్‌ అందుకున్నారు’’ అన్నారు. ‘‘కీర్తి అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా ఎంజాయ్‌ చేస్తూ ఈ పాట చేశాను’’ అన్నారు బృంద. సంగీతదర్శకుడు పవన్, రూట్‌ ప్రతినిధి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: (పాన్​ ఇండియాగా రామ్​ మూవీ.. హీరోయిన్​గా బాలీవుడ్​ బ్యూటీ !)

Advertisement
Advertisement