కీర్తీ సురేష్ సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల | Keerthy Suresh Movie Uppu Kappurambu OTT Release | Sakshi
Sakshi News home page

కీర్తీ సురేష్ సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల

Jul 27 2024 7:58 PM | Updated on Jul 27 2024 8:06 PM

Keerthy Suresh Movie Uppu Kappurambu OTT Release

హీరోయిన్‌  కీర్తీ సురేశ్‌‌ మెయిన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న కొత్త సినిమా ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో  సుహాస్‌ మరో లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. ఐవీ శశి దర్శకత్వంలో తెరకెక్కుత్ను ఈ చిత్రాన్ని రాధికా లావు  నిర్మించారు. వసంత్‌ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు.

ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌, సుహాస్‌ జంటగా నటిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.  అయితే, ఉప్పు క‌ప్పురంబు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ కోస‌మే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

 తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ ఏడాదిలోనే  ఈ సినిమా విడుదల కానుంది. త్వరలోనే మరిన్ని విషయాలు ఉప్పు కప్పురంబు మేకర్స్‌ వెల్లడించనున్నారు. కీర్తీ సురేశ్‌ నటించిన ర‌ఘుతాత సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. మరోవైపు బేబీ జాన్‌ సినిమాతో ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement