మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్..

 Keerthy Suresh Miss India Trailer released - Sakshi

 కీర్తి సురేష్  మిస్ ఇండియా ట్రైలర్ అదుర్స్

బిజినెస్ అంటే ఆడపిల్లల ఆట కాదు.. ఒక యద్ధం!!  

సాక్షి, హైదరాబాదు : మహానటి  సినిమాతో జాతీయ అవార్డు కొట్టేసిన కీర్తి సురేష్ మరో అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి నటించిన మిస్‌ ఇండియా ట్రైలర్ శనివారం రిలీజ్ అయ్యింది. చదువు, చిన్న ఉద్యోగం, కుటుంబం, వీటన్నింటికీ భిన్నంగా  ఒక మధ్యతరగతి యువతి చిన్నప్పటి నుంచి బిజినెస్‌ చేయాలనే ఆలోచనతో పెరగడం, ఇండియన్ చాయ్ బిజినెస్ ద్వారా ఉన్నతంగా ఎదిగిన తీరును ఈ ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు.  మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ మరో లేడీ ఓరియంటెడ్ పాత్రతో ఎప్పటిలాగానే కీర్తి సురేష్ నటన, బిజినెస్ అనేది ఆడపిల్లల ఆట కాదంటున్న జగపతి బాబు విలనిజం, థమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 
 
నరేంద్ర నాథ్ దర్శకత్వంలో మహేష్‌ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర,రాజేంద్ర ప్రసాద్‌, నదియా, కమల్ కామరాజు, నరేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  నవంబర్ 4న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటినుంచీ భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ  చిత్రం తాజా ట్రైలర్ తో మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఈ మధ్యకాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన పెంగ్విన్ సినిమాతో ప్రశంసలందుకుంది  కీర్తి.  అటు వరుస హిట్ లను అందిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫాంలో  మరో సాలిడ్ హిట్ ఖాయమంటున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top