ఎర్రగులాబీలులో... కీర్తీ సురేష్‌ | Sakshi
Sakshi News home page

ఎర్రగులాబీలులో... కీర్తీ సురేష్‌

Published Sat, Aug 8 2020 8:26 AM

Keerthi Suresh Acting As Kamal Hassan Sigappu Rojakkal Sequel - Sakshi

కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా భారతీరాజా దర్శకత్వంలో దాదాపు 40 ఏళ్లక్రితం వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘శిగప్పు రోజాక్కళ్‌’. ఈ చిత్రం తెలుగులో ‘ఎర్ర గులాబీలు’ పేరుతో అనువాదమై, విడుదలైంది. రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలోనూ రీమేక్‌ అయింది. నలభైఏళ్ల తర్వాత ఇప్పుడు ‘శిగప్పు రోజాక్కళ్‌’కి సీక్వెల్‌ తీయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భారతీరాజా ఈ చిత్రానికి కథ అందించటంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తారు. భారతీరాజా కుమారుడు మనోజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. శ్రీదేవి పాత్రలో ‘మహానటి’ ఫేమ్‌ కీర్తీ సురేశ్‌ని నటింపజేయాలనుకున్నారట. కీర్తి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. మరి కమల్‌ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. ‘ఎర్రగులాబీలు’ చిత్రానికి సంగీతం అందించిన ఇళయరాజానే ఈ సీక్వెల్‌కు సంగీతాన్ని సమకూరుస్తారని సమాచారం. రివెంజ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్‌ పూర్తయింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారని తెలిసింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement