Katrina Kaif: కత్రినా కైఫ్‌ ఆస్తుల లెక్క చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

Katrina Kaif Net Worth 2021: Expensive Assets, Luxurious House And Cars, Salary - Sakshi

Katrina Kaif Net Worth: ఆమె చూపుల్తోనే బాణం వదులుతుంది.. తన ఒంపుసొంపులతో నయాగరా జలపాతాన్ని గుర్తు చేస్తుంది.. తన నవ్వుతో ఇంద్రధనస్సును నేలమీదకు తీసుకొస్తుంది.. డ్యాన్స్‌తో నెమలి నాట్యాన్ని కళ్ల ముందుంచుతుంది.. నటనతో అందరినీ ఫిదా చేస్తుంది.. ఆమె మరెవరో కాదు స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌.. నేడు(జూలై 16న) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈ హీరోయిన్‌ ఇప్పటివరకు ఎంత సంపాదించింది? ఎంత వెనకేసుకుందో తెలుసుకుందాం..

'బూమ్‌' సినిమాతో నటిగా కెరీర్‌ ఆరంభించింది కత్రినా కైఫ్‌. తొలి చిత్రంలోనే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించే ఆఫర్‌ కొట్టేసిన ఈ భామ తర్వాత 'మల్లీశ్వరి' సినిమాతో టాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డును కూడా అందుకుంది.  కానీ తర్వాత ఆమె ఇక్కడ పెద్దగా సినిమాలేమీ చేయలేదు. 'అల్లరి పిడుగు' చిత్రం తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్‌ 'చిక్నీ చమేలీ', 'షీలాకీ జవానీ' అంటూ ఐటం సాంగ్స్‌తోనూ అదరగొట్టింది.

సుమారు 40కి పైగా సినిమాల్లో ఆడిపాడిన కత్రినా.. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఆంగ్ల మీడియాలో ప్రచురితమవుతున్న కథనాల ప్రకారం.. ఆమె ఒక్క సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటుందట. వాణిజ్య ప్రకటనలు, తన మేకప్‌ బ్రాండ్‌ 'కే బ్యూటీ' ద్వారా వచ్చే ఆదాయం దీనికి అదనం. ఇవేకాక ఫిట్‌నెస్‌ బ్రాండ్‌ 'రీబూక్‌'కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఆమె రీబూక్‌ నుంచి కూడా బాగానే వసూలు చేస్తోందట. ఆమెకు ముంబైలో ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని ఖరీదు సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా!

లండన్‌లోనూ ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కోట్లు విలువ చేసే భూమి కూడా తన పేరు మీద ఉందట. ఇక కార్ల మీద మోజు పడే కత్రినా గ్యారేజీలో ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ వోగ్‌ ఎల్‌డబ్ల్యూబీతో పాటు మెర్సిడిస్‌ ఎమ్‌ఎల్‌ 350, ఆడీ క్యూ 7 కార్లు కూడా ఉన్నాయి. మొత్తంగా కత్రినా కైఫ్‌కు రూ.150 కోట్ల పైచిలుకు ఆస్తి ఉండొచ్చని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top