బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్‌ ఫొటోలు | Katrina Kaif And Vicky Kaushal Shares Their Haldi Function Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Katrian Kaif-Vicky Kaushal: ఆకట్టుకుంటున్న విక్ట్రీనా హల్ది ఫంక్షన్‌ ఫొటోలు

Dec 11 2021 1:19 PM | Updated on Dec 11 2021 2:11 PM

Katrina Kaif And Vicky Kaushal Shares Their Haldi Function Photos Goes Viral - Sakshi

Katrina Kaif And Vicky Kaushal Haldi Function Photos Goes Viral: బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌లు ఒక్కటయ్యారు. గురువారం(డిసెంబర్‌ 9) రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్ట్రీనా(విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌) పెళ్లి ఘనంగా జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి జరిగింది. అయితే  పెళ్లి జరిగే వారకు దీనికి సంబంధించిన ఏ అప్‌డేట్స్‌ బయటకు రాకుండా విక్ట్రీనా జాగ్రత్తపడ్డారు. నిశ్చితార్థం, పెళ్లి ముహుర్తం, వేడుకలు, హాల్దీ ఫంక్షన్‌, పెళ్లి వరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా సీక్రెట్‌గా ఉంచారు.

చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్‌.. సారా షాకింగ్‌ కామెంట్స్‌

అయితే ఏదో విధంగా అవి పుకార్లుగా బయటకు వచ్చాయి. చివరికి అవే నిజమవుతూ వారి వివాహం జరిగింది. అనంతరం విక్ట్రీనాలు తామిద్దరం ఒక్కటయ్యామంటూ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అయితే సెలబ్రెటీల పెళ్లి అంటే దానికి ముందు జరిగే సెలబ్రెషన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. వారి హల్దీ ఫంక్షన్‌, సింగీత్‌లను వేడుకలా జరుపుకుంటారు. ఈ కార్యక్రమాల్లో వారు చేసే సందడి మామూలుగా ఉండదు. చూస్తే కళ్లు చెదిరెలా అట్టహాసంగా ఈ కార్యక్రమాలను జరుపుకుంటారు. అందుకే వాటిని చూసేందుకు ఫ్యాన్స్‌ ఆసక్తి చూపుతుంటారు. కానీ విక్ట్రీనా పెళ్లి వేడుకల్లో ఇవేవి బయటకు రాలేదు.

చదవండి: ఆ షాట్‌తో చరణ్‌, తారక్‌ల బాండింగ్‌ అర్థమైంది: రాజమౌళి

దీంతో వారి ఫ్యాన్స్‌ అంతా నిరాలో ఉన్నారు. ఇదిలా ఉంటే వివానంతరం ప్రకటన ఇచ్చిన విక్ట్రీనా మెల్లిమెల్లిగా ఫొటోలను బయటకు వదులుతున్నారు. ఇప్పటికే వారి పెళ్లి ఫొటోలను షేర్‌ చేయగా తాజాగా హల్ది ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ హల్ది ఫంక్షన్‌లో ఈ జంట నవ్వుతూ సంతోషంగా కనిపించడంతో వారి ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ మురిసిపోతున్నారు. ‘క్యూట్‌ కపుల్‌’ అంటూ వారి ఫొటోలకు కామెంట్స్‌ చేస్తూ వారి ఫొటోలను వైరల్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement