Katrina Kaif Vicky Kaushal Marriage Date, December 9 & Wedding Updates In Telugu - Sakshi
Sakshi News home page

Katrina-Vicky wedding: సినీ స్టార్ట్స్‌తోపాటు, అంబానీ ఫ్యామిలీ

Dec 9 2021 10:42 AM | Updated on Dec 9 2021 2:23 PM

Katrina Kaif and Vicky Kaushal are set to tie the knot  Dec 9 - Sakshi

Katrina Kaif Vicky Kaushal Marriage Date: బాలీవుడ్  లవ్‌బర్డ్స్‌  విక్కీ కౌశల్  కత్రినా కైఫ్‌ల వివాహం ముచ్చటే ఇపుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని విలాస వంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఇప్పటికే కత్రినా, విక్కీ కౌశల్ మెహందీ వేడుక పూర్తి చేసుకున్నారు కూడా. 

మూడుముళ్ల వేడుక
బుధవారం సాయంత్రం హల్దీ వేడుక, ఆ తరువాత సంగీత్‌ అనంతరం డిసెంబర్ 9, గురువారం మధ్యాహ్నం  సిక్స్ సెన్సెస్ బార్వారా ఫోర్ట్‌  వేదికగా సెహ్రా బంద్ వేడుక తర్వాత ఏడు అడుగులు వేసేందుకు ఈ జంట సిద్ధమవుతోంది.పెళ్లయ్యాక కొత్త జంట రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. వెడ్డింగ్ ప్లానర్‌లు ముఖ్య అతిథుల కోసం 8 నుండి 10 టెంట్‌లను బుక్ చేశారట. వీటికి  రాత్రికి రూ.70 వేలు ఖర్చవుతుందట.

ముఖ్య అతిథులు
విక్కీ-కత్రినా వివాహానికి వీవీఐపీలతో పాటు కార్పొరేట్‌ దిగ్గజాలు  ముఖేశ్‌ అంబానీ కుటుంబం, ఆయన సోదరుడు అనిల్‌ అంబానీ కుటుంబం కూడా ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్టు సమాచారం. ఒబెరాయ్ హోటల్‌లో వారి కోసం 5 గదులు కూడా రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ తదితర తారలతోపాటు, క్రికెటర్‌ విరాట్-అనుష్కతో ఈ వివాహానికి రావచ్చని అంచనా.  అయితే ఆహ్వానితులకు సెక్యూరిటీ కోడ్ లేకుండా ఎంట్రీ లేదట.

అయితే నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులు, సినీ దర్శకుడు కబీర్ ఖాన్ , ఆమె భార్య మినీ మాథుర్,  నటి శార్వారీ బాగ్, రోహిత్ శెట్టి ఇప్పటికే వెడ్డింగ్‌ డెస్టినేషన్‌కు చేరుకున్నారు. మరోవైపు గూగుల్‌  విక్కీ  భార్య కత్రినాగా  గూగుల్‌  పేర్కొనడం విశేషం.  

ఓటీటీ దిగ్గజంతో డీల్‌:  రూ. 100 కోట్లు ఆఫర్
సాధారణంగా సెలబ్రిటీలు తమ వివాహ ఫుటేజీలు, ఫోటోలను,  మ్యాగజైన్‌లకు  కొన్నిసార్లు ఛానెళ్లకు  విక్రయించడం ఇపుడు ట్రెండ్. ఈ నేపథ్యంలో స్ట్రీమింగ్ దిగ్గజం  పింక్‌ విల్లా  పెళ్లికి సంబంధించిన ఫుటేజీ హక్కుల కోసం కత్రినా కైఫ్ , విక్కీ కౌశల్‌లకు ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్ చేసినట్టు టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement